Health: మగ మహారాజులకు అలర్ట్.. పచ్చళ్లు ఫుల్లుగా తింటున్నారా..? ఆ సామర్థ్యాన్ని కోల్పోతారు జాగ్రత్త..

పచ్చిమిర్చి, కారం, చట్నీలు, ఊరగాలు లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషులకు హాని కలుగుతుందన్న విషయం తెలుసా..? ఇవి ఎక్కువగా తింటే పురుషులు పలు సమస్యలను ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Health: మగ మహారాజులకు అలర్ట్.. పచ్చళ్లు ఫుల్లుగా తింటున్నారా..? ఆ సామర్థ్యాన్ని కోల్పోతారు జాగ్రత్త..
Mens Health
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 06, 2022 | 3:44 PM

Mens health: ఆరోగ్యంగా ఉండేందుకు జీవనశైలితోపాటు మంచి ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఈ రోజుల్లో ప్రజలు ఆహారం రుచిని పెంచడానికి చట్నీలు, ఊరగాయలు లాంటివి తింటున్నారు. అయితే పచ్చిమిర్చి, కారం, చట్నీలు, ఊరగాలు లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషులకు హాని కలుగుతుందన్న విషయం తెలుసా..? ఇవి ఎక్కువగా తింటే పురుషులు పలు సమస్యలను ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చట్నీలు తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఊరగాయలు (చట్నీ) స్నాక్స్, లంచ్, డిన్నర్‌లలో తీసుకుంటారు. అయితే.. అన్ని రకాల వంటకాలకు ఆహారంలో రుచిని జోడించేందుకు ఊరగాయ తింటారు. కానీ చాలా మంది మితంగా కాకుండా ఎక్కువగా తీసుకుంటుంటారు. మీరు కూడా ఊరగాయను ఎక్కువగా తింటుంటే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

గ్యాస్ట్రిక్ క్యాన్సర్

ఇవి కూడా చదవండి

పలు అధ్యయనాల ప్రకారం.. ఊరగాయలను ఎక్కువగా తినే వ్యక్తుల్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. అదే సమయంలో అధిక ఉప్పు కంటెంట్ కారణంగా రక్తపోటు రోగులకు, గుండె సమస్యలున్న వారికి చాలా ప్రమాదకరమని రుజువు చేస్తుంది. ఇది ప్రమాదకరమైనదిగా మారొచ్చని పేర్కొంటున్నారు.

మార్కెట్‌లో కొనే పచ్చళ్లలో (ఊరగాయల్లో) ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయని మీకు తెలుసా..? అలాగే ఆ పచ్చళ్లలో అష్టమిప్రిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి హానికరం అన్న విషయం మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. అష్టమిప్రిడ్ కార్బన్ అని పేర్కొంటున్నారు. మీ లైంగిక జీవితానికి ఆటంకం కలిగించే పదార్థం కావున పరిమిత పరిమాణంలో మాత్రమే ఊరగాయలను తినండి.

కొలెస్ట్రాల్ ప్రమాదం పెరుగుతుంది

ఇంట్లో తయారుచేసిన ఊరగాయలను పరిమిత పరిమాణంలో తినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మార్కెట్లలోని ఊరగాయల్లో రుచిగా ఉండటానికి ఎక్కువ నూనె, మసాలాలను ఉపయోగిస్తారు. ఇది మన ఆరోగ్యానికి చెడు జరుగుతుంది. పచ్చళ్లలో నూనె ఎక్కువగా ఉండటం వల్ల అందులో వాడే మసాలాల వల్ల కొలెస్ట్రాల్ తదితర శారీరక సమస్యలు తలెత్తుతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ వార్తల కోసం