Healthy Sleep: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా..? అయితే మీరు ప్రమాదానికి దగ్గరైనట్లే..

తగినంత నిద్ర లేకపోవటం వల్ల శరీరంపైనే కాదు మెదడుపైనా ప్రభావం పడుతుంది. దీని కారణంగా జ్ఞాపకశక్తి కోల్పోయే సమస్యతోపాటు శక్తి స్థాయి కూడా తగ్గుతుంది.

Healthy Sleep: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా..? అయితే మీరు ప్రమాదానికి దగ్గరైనట్లే..
Sleeping Disorder
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 05, 2022 | 7:46 PM

Sleep Disorders and Problems: ఉరుకుపరుగుల జీవితం.. పని, ఒత్తిడి, కుటుంబ బాధ్యత, చెడు అలవాట్లు, ఇలా అనేక సమస్యలు చాలామందిని వెంటాడుతుంటాయి. ఇలాంటి సందర్భంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. రోజులో తగినంత నిద్ర పోకపోవడం (అసంపూర్ణ నిద్ర) అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. నిద్రలేమితో బాధపడుతుంటే.. వీలైనంత త్వరగా ఈ అలవాటును దూరం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే తక్కువ నిద్రపోవడం ద్వారా మీరు మీ పని గంటలు లేదా ఒత్తిడి సమయాన్ని పెంచుకోవడంతో మీకు మీరే జీవితాన్ని తగ్గించుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీంతోపాటు శరీరం అనారోగ్యానికి గురవుతుందని పేర్కొంటున్నారు. తగినంత నిద్ర లేకపోవటం వల్ల శరీరంపైనే కాదు మెదడుపైనా ప్రభావం పడుతుంది. దీని కారణంగా జ్ఞాపకశక్తి కోల్పోయే సమస్యతోపాటు శక్తి స్థాయి కూడా తగ్గుతుంది. నిద్రలేమి, తక్కువ నిద్రపోవడం వల్ల అది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.

తక్కువ నిద్ర వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

తక్కువ నిద్రపోవడం లేదా తగినంత నిద్ర రాకపోవడం అంటే మీరు రోజులో 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారని అర్థం. ఇలా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా బలహీనపడతారు.

ఇవి కూడా చదవండి

కండరాల ఒత్తిడి – నొప్పి: నిద్ర పూర్తి కానప్పుడు శరీరానికి పూర్తి విశ్రాంతి లభించదు. మనం నిద్రపోతున్నప్పుడు, మన శరీరం కండరాలు, కణాలను రిపేర్ చేస్తుంది. ఈ ఇది పూర్తికానప్పుడు శరీరంలో ఆందోళన, ఉద్రిక్తత ఏర్పడుతుంది. దీని కారణంగా ఒత్తిడి, నొప్పి లాంటి సమస్యలు వస్తాయి.

అయోమయం: శరీర అవసరానికి తగినంత నిద్ర లేకపోవడం వల్ల నిత్యం గందరగోళం నెలకొంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు నిర్ణయం తీసుకోవడంలో సమస్య ఉంటుంది. సాధారణ సమస్యలు సైతం మరింత తీవ్రమవుతాయి. చికాకు: మానసిక, శారీరక అలసట దుఃఖాన్ని పెంచుతుంది. అదే సమయంలో పని ఒత్తిడి, అనిశ్చితి చికాకును పెంచుతుంది. ఈ కారణంగా కోపం ఎక్కువగా వస్తుంది. పనితో పాటు, ఇతరులతో సాన్నిహిత్యం చెడిపోతుంది.

ఊబకాయం: తక్కువ నిద్రపోవడం లేదా తగినంత నిద్ర లేకపోవడం ఊబకాయాన్ని కూడా పెంచుతుంది. ఎందుకంటే నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఉబ్బరం సమస్య పెరిగి శరీరంపై కొవ్వు, వేలాడుతున్న అనుభూతి కలుగుతుంది. దీంతో శరీర భారం పెరుగుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ వార్తల కోసం