Viral Video: మానవత్వం అంటే ఇదే.. రిక్షావాలా కష్టం చూసి చలించిపోయిన పోలీస్.. ఏం చేశాడంటే.. వీడియో

ప్రేమ కంటే.. ద్వేషం వేగంగా వ్యాపిస్తున్న నేటి ప్రపంచంలో మానవత్వం బతికుందని ఎవరో ఒకరు నిరుపిస్తుంటారు. డబ్బు దానం కంటే.. వారికి అవసరమైన వస్తువులను ఇవ్వడం వారికి తృప్తినిస్తుంది.

Viral Video: మానవత్వం అంటే ఇదే.. రిక్షావాలా కష్టం చూసి చలించిపోయిన పోలీస్.. ఏం చేశాడంటే.. వీడియో
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 05, 2022 | 3:38 PM

UP Policeman Viral Video: కొంతమంది కుటుంబాన్ని పోషించడం కోసం తాము ఏమైపోయినా పర్వాలేదని గొడ్డు చాకిరీ చేస్తుంటారు. ఎంతలా అంటే కనీసం పాదాలకు చెప్పులు లేకుండా ఎండలో పనిచేస్తుంటారు. అలాంటి వారిని చూసి చాలామంది పట్టించుకోకపోయినా.. ఎవరో ఒకరు స్పందించి వారికి సాయం చేస్తుంటారు. ప్రేమ కంటే.. ద్వేషం వేగంగా వ్యాపిస్తున్న నేటి ప్రపంచంలో మానవత్వం బతికుందని ఎవరో ఒకరు నిరుపిస్తుంటారు. డబ్బు దానం కంటే.. వారికి అవసరమైన వస్తువులను ఇవ్వడం వారికి తృప్తినిస్తుంది. అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఇది మీ హృదయాన్ని కట్టిపడేస్తుంది. ఇంకా.. మీ కళ్లలో, మనస్సులో ఆనందాన్ని నింపుతుంది. రోడ్డుపై చెప్పులు లేకుండా నడుస్తున్న కార్ట్ పుల్లర్‌కు యూపీ కానిస్టేబుల్ ఒక జత కొత్త చెప్పులు కొని ఇచ్చిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను యూపీ పోలీసు అధికారి శివంగ్ శేఖర్ గోస్వామి ట్విట్టర్‌లో షేర్ చేశారు. రిక్షా లాగే వ్యక్తి చెప్పులు లేకుండా రోడ్డుపై నడుస్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు. రోడ్డు పక్కన ఉన్న ఒక పోలీసు అది చూసి వెంటనే ఆ వ్యక్తికి కొత్త చెప్పులు కొని ఇచ్చాడు. అతను వెంటనే ఆనందంతో చప్పల్స్ ధరించాడు. అంతేకాకుండా తన పరిస్థితిని చూసి చలించిపోయిన పోలీసుకు కృతజ్ఞతలు చెప్పాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షలకు పైగా వీక్షించారు. దీంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

వైరల్ అవుతున్న వీడియోలో పోలీస్‌ హుందాతనం నెటిజన్ల హృదయాలను ఆకట్టుకుంటోంది. పోలీసు సేవ అజరామరమని.. అతనికి సెల్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం