Mumbai Rain: ముంబై మునిగింది.. భారీ వర్షాలతో అతలాకుతలం.. ట్రాఫిక్‌ జామ్‌..!

Mumbai Rain: ముంబై మునిగింది. భారీ వర్షాలతో అతలాకుతలమైంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా నీరు చేరింది. అండర్‌ పాస్‌ నుంచి సబ్‌వేల్లో పూర్తిగా..

Mumbai Rain: ముంబై మునిగింది.. భారీ వర్షాలతో అతలాకుతలం.. ట్రాఫిక్‌ జామ్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Jul 05, 2022 | 2:44 PM

Mumbai Rain: ముంబై మునిగింది. భారీ వర్షాలతో అతలాకుతలమైంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా నీరు చేరింది. అండర్‌ పాస్‌ నుంచి సబ్‌వేల్లో పూర్తిగా నీరు చేరింది. రుతుపవనాల ప్రభావంతో 24 గంటలుగా ముంబై భారీ వర్షం కురుస్తోంది. గల్లీల నుంచి రోడ్ల వరకు అన్ని నీట మునిగాయి. కొన్ని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్‌ స్లో గా మూవ్‌ అవుతోంది. రోడ్లపై భారీ నీరు నిలవడంతో 8 మార్గాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు.

హెవీ రెయిన్స్‌తో ముంబైలోని రైల్వే స్టేషన్లు జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు నవీ మానస సరోవర్‌ రైల్వేస్టేషన్‌ నీట మునిగింది. కొన్ని ప్రాంతాల్లో బస్సులు, రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 24 గంటల్లో ముంబైలో 95.81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.పట్టాలపై నీళ్లు నిలవడంతో పలుచోట్ల లోకల్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఠాణే, పాల్ఘర్‌, పుణెల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కల్యాణ్‌, భీవండి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అమరావతి జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరవాసులను అధికారులు అప్రమత్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి