Covid 4th Wave: నిన్న ఒక్క రోజే 13,086 కరోనా కొత్త కేసులు నమోదు.. డేంజర్ బెల్స్!
కరోనా ఫోర్త్ వేవ్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దేశంలో గడచిన 24 గంటల్లో (సోమవారం) దాదాపు 13,086 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ రోజు (జులై 5) ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
Covid 19 updates: కరోనా ఫోర్త్ వేవ్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దేశంలో గడచిన 24 గంటల్లో (సోమవారం) దాదాపు 13,086 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ రోజు (జులై 5) ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,14,475 మేర ఉన్నట్లు తెలుస్తోంది. క్రితం రోజుతో పోల్చితే 611 కేసులు పెరిగాయి. 19 మంది కరోనాతో మరణించారు. దీంతో మృతుల సంఖ్య 5,25,242కు చేరుకుంది. సోమవారం ఒక్క రోజులోనే 12,456 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెల్పింది. ఇన్ఫెక్షన్ రేటు 0.26 శాతంగా ఉండగా, రికవరీల రేటు 98.54శాతంగా ఉన్నట్లు తెల్పింది. రోజువారీ పాజివిటీ రేటు 2.90శాతానికి పడిపోయింది. వీక్లీ పాజిటివిటీ రేటు 3.81 శాతం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,76,637 మంది వైరస్ బారినపడ్డారు. 804 మంది కరోనాతో మృతి చెందారు. జర్మీనీలో తీవ్రత అధికంగా ఉంది. అక్కడ నిన్న ఒక్కరోజే 147,489 కేసులు నమోదయ్యాయి. 102 మంది మరణించారు. ఆ తర్వాత స్థానంలో ఇటలీ ఉంది. అక్కడ ఒక్కరోజే 36,000లకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. బ్రెజిల్, తైవాన్, ఆస్ట్రేలియా దేశాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.