AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: వరుసగా మూడో ఏడాది విద్యాకానుక.. పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం జగన్..

Jagananna Vidya Kanuka: కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఈ కిట్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఫస్ట్‌ నుంచి టెన్త్‌ క్లాస్‌ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ ప్రత్యేక కిట్లు అందజేశారు.

CM Jagan: వరుసగా మూడో ఏడాది విద్యాకానుక.. పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం జగన్..
Cm Jagana
Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 05, 2022 | 1:45 PM

Share

వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యాకానుక కింద కిట్ల పంపిణీ జరిగింది. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఈ కిట్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఫస్ట్‌ నుంచి టెన్త్‌ క్లాస్‌ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ ప్రత్యేక కిట్లు అందజేశారు. ఈ ఏడాది ఈ పథకం కోసం 931 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో భాగంగా .. బోధనా కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 5 నుంచి నెలాఖరు వరకు విద్యాకానుక కిట్లను విద్యార్ధులకు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్ధినీ, విద్యార్ధులకు రూ. 931.02 కోట్ల ఖర్చుతో సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా లాంఛనంగా మంగళవారం కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ జరుగనుంది. ప్రతీ విద్యార్ధికీ దాదాపు రూ. 2,000 విలువైన జగనన్న విద్యా కానుక ద్వారా అందనున్నాయి.

ఏపీలో ఇవాళ్టి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్ధుల కోసం జగనన్న విద్యాకానుక కిట్లను అందిస్తున్నారు. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టింది. మన బడి, నాడు నేడు కింద రూ. వేల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. జగనన్న విద్యాకానుక కింద విద్యార్ధుల చదువులకు అవసరమయ్యే వస్తువులను కిట్ల రూపంలో అందిస్తోంది. జగనన్న “గోరుముద్ద” ద్వారా రుచికరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఏటా పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేపట్టింది. ప్రభుత్వ కార్యక్రమాలతో విద్యార్ధుల చేరికలు భారీగా పెరిగాయి.

విద్యపై పెట్టే వ్యయం విద్యార్ధుల భవిష్యత్‌కు పెట్టుబడి అనే మహోన్నత ఆలోచనతో సీఎం వైఎస్‌ జగన్‌ ఏటా విద్యారంగానికి బడ్జెట్‌లో వేల కోట్లు కేటాయిస్తున్నారు. బడులు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక క్రింద ప్రతి విద్యార్ధికి ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్‌ కుట్టుకూలితో సహా అందిస్తారు. ఒక జతల బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్‌, వర్క్‌బుక్స్‌తో పాటు అదనంగా ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీషు – తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందజేస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుండి పదో తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్ధినీ, విద్యార్ధులకు రూ. 931.02 కోట్ల ఖర్చుతో సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ జరుగుతుంది. ప్రతి విద్యార్థికి రూ. 2,000 విలువైన జగనన్న విద్యా కానుక ద్వారా అందనున్నాయి.

 ఏపీ వార్తల కోసం