Viral Video: వ్యక్తి ప్రాణాలను కాపాడిన పిల్ల ఏనుగు.. నదిలో కొట్టుకుపోతుండగా.. హార్ట్ టచింగ్ వీడియో..
అందులో ఓ వ్యక్తి నదిలో కొట్టుకుపోతున్నాడు. అతను ఈదుతూ ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఫలితం లేకుండా నదిలో కొట్టుకుపోతున్నాడు.

మనుషులకే కాదు.. జంతువులలోనూ మానవత్వం ఉంటుంది. నమ్మితే జంతువులు ప్రాణాలను ఫణంగా పెట్టేందుకు కూడా వెనకడవు. దీనికి సంబంధించిన ఎన్నో సన్నివేశాలను మనం చూస్తునే ఉంటాం. కుక్కలు యాజమానులను కాపాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే తాజాగా ఓ ఏనుగు పిల్ల ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు ప్రాణాలను తెగించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
అందులో ఓ వ్యక్తి నదిలో కొట్టుకుపోతున్నాడు. అతను ఈదుతూ ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఫలితం లేకుండా నదిలో కొట్టుకుపోతున్నాడు. అక్కడే ఏనుగుల గుంపులో ఉన్న పిల్ల ఏనుగు వెంటనే నీటి ప్రవాహంలో పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ వ్యక్తిని కాపాడి ఒడ్డుకు చేర్చింది. ఇది పాత వీడియోనే అయిన ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.




These days, animals have more humanity than humans pic.twitter.com/FH8mIdkJVk
— Lost Temples™ (@LostTemple7) July 4, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.