Pushpa 2 Movie: పుష్ప 2 మూవీపై మరో క్రేజీ టాక్.. ఆ స్టార్ హీరో కీలకపాత్రలో ఉండడం నిజమేనట !!

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపించారు.

Pushpa 2 Movie: పుష్ప 2 మూవీపై మరో క్రేజీ టాక్.. ఆ స్టార్ హీరో కీలకపాత్రలో ఉండడం నిజమేనట !!
Pushpa 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 05, 2022 | 11:26 AM

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది పుష్ప. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకువస్తున్నట్లుగా గతంలోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పుష్ప సినిమా హిట్ తో పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి. పుష్ప ది రూల్ అనే టైటిల్ తో రాబోతున్న సెకండ్ పార్ట్ పై ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో కీలకపాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించనున్నట్లుగా గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి పుష్ప మొదటి భాగంలో గోవిందప్ప విజయ్ నటించాల్సిందని.. డేట్స్ కుదరకపోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు పుష్ప ది రూల్ లో కీలకపాత్రలో మక్కల్ సెల్వన్ కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక ఈసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నాడని.. కొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే నిజమైతే పుష్ప 2 పై అంచనాలు తారాస్థాయికి వెళ్లడం ఖాయంగా తెలుస్తోంది.