Bimbisara: బింబిసారలో పవర్ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ .. ఆసక్తికర కామెంట్స్ చేసిన కళ్యాణ్ రామ్..
నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వశిష్ఠ్ ఈ చిత్రంతో
వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక చోటు సంపాదించుకున్న హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram). చాలా కాలం తర్వాత కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం బింబిసార. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూన్ 5న కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బింబిసారను నాలుగు భాగాల ఫ్రాంచైజీగా ప్లాన్ చేశానని.. అన్ని కుదిరితే ఎన్టీఆర్ నటించే ఛాన్స్ ఉందని తెలిపారు.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘ రెండున్నరేళ్ల తర్వాత అందరినీ కలుస్తున్నాను. ఎన్నో చందమామ కథలు విన్నాం. చదివాం.. కొన్ని చూశాం. కొన్ని తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మలు కొన్ని కథలను చెబితే, కొన్నింటిని మనం పుస్తకాల్లో చదివాం. కొన్నింటిని మనం వెండితెరపై చూసుంటాం. తాతగారు చేసిన పాతాళ భైరవి, గులేబకావళి కథ, జగదేవీరుని కథ, బాబాయ్ చేసిన భైరవ ద్వీపం, తర్వాత వచ్చిన ఆదిత్య 369.. తర్వాత చిరంజీవిగారు చేసిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మా జనరేషన్‌లో తమ్ముడు చేసిన యమదొంగ, రామ్ చరణ్ చేసిన మగధీర, రీసెంట్‌గా వచ్చిన ప్రభాస్ బాహుబలి సినిమాలు గమనిస్తే.. అన్ని అందమైన సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి అందమైన గొప్ప చందమామ కథను ఆగస్ట్ 5న మీ ముందుకు తీసుకొస్తున్నాం. అదే బింబిసార. ఆ సినిమాలను ఆదరించినట్లే ఈ సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. టీజర్, ట్రైలర్ మీకు నచ్చే ఉంటాయని అనుకుంటున్నాను. మా సినిమా కోసం పనిచేసిన తోటి నటీనటులకు చాలా థాంక్స్. అందరూ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో మళ్లీ మరోసారి మాట్లాడుతాను. ఈ ఏడాది మా తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్‌గారి వందవ పుట్టిన రోజు సంవత్సరంగా వన్ అండ్ ఓన్లీ లెజెండ్ అయిన ఆయకు మా బింబిసార సినిమాను డేడికేట్ చేస్తున్నాను’’ అన్నారు.