Vishal: మరోసారి గాయపడ్డ హీరో విశాల్.. షూటింగ్ సమయంలో ఒక్క సారిగా కుప్పుకూలిన నటుడు

సినీ కథానాయకుడు విశాల్ (vishal) మరోసారి గాయపడ్డారు. అలా ఇప్పటికే ఆయన చాలా సార్లు ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్ సమయంలో ప్రమాదాలు జరిగినప్పటికీ.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆ షాట్లను ఆయనే కంప్లీట్ చేస్తాడు. తాజాగా ఆయన ‘లాఠీ’....

Vishal: మరోసారి గాయపడ్డ హీరో విశాల్.. షూటింగ్ సమయంలో ఒక్క సారిగా కుప్పుకూలిన నటుడు
Vishal
Follow us
Ganesh Mudavath

| Edited By: Anil kumar poka

Updated on: Jul 07, 2022 | 9:53 AM

సినీ కథానాయకుడు విశాల్ (vishal) మరోసారి గాయపడ్డారు. అలా ఇప్పటికే ఆయన చాలా సార్లు ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్ సమయంలో ప్రమాదాలు జరిగినప్పటికీ.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆ షాట్లను ఆయనే కంప్లీట్ చేస్తాడు. తాజాగా ఆయన ‘లాఠీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ (Hyderabad) లో ఈ ఏడాది ఫ్రిబ్రవరిలో జరిగింది. ఆ సమయంలో విశాల్ ఒకసారి గాయపడ్డారు. తాజాగా చెన్నైలో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నప్పుడు మరోసారి ప్రమాదానికి గురయ్యారు. ఆయన కాలుకు బాగా దెబ్బ తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే పడిపోయారు. ఈ హఠాత్పరిణామంతో షూటింగ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్ ప్రారంభించనునట్లు చిత్ర బృందం వెల్లడించింది. కాగా.. విశాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇంట్రడక్షన్‌ పోరాట సన్నివేశాలు షూట్ చేస్తున్న ఈ సమయంలో విశాల్ కు గాయాలయ్యాయి. సంబంధిత వీడియోను చిత్ర బృందం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. పోలీసు అధికారి అయిన విశాల్‌ రౌడీ గ్యాంగ్‌ను అదుపు చేసే సన్నివేశమది. ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చేస్తూనే విశాల్‌ ఉన్నట్టుండి పడిపోవడంతో సహ నటులంతా షాక్‌ అయ్యారు. ఈ సినిమాను పవర్‌ఫుల్‌ పోలీసు కథతో దర్శకుడు ఎ. వినోద్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో సునయన కథానాయిక.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి