Sai Pallavi Gargi Movie: గార్గి రిలీజ్ డేట్‌ను ప్రకటించిన సాయిపల్లవి.. సినిమా విడుదల ఎప్పుడంటే..
విరాటపర్వంలో వెన్నెలగా మరోసారి ఆకట్టుకున్నారు సాయి పల్లవి. రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ఈ న్యాచురల్ బ్యూటీ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.
విరాటపర్వంలో వెన్నెలగా మరోసారి ఆకట్టుకున్నారు సాయి పల్లవి. రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ఈ న్యాచురల్ బ్యూటీ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత సాయిపల్లవి నటిస్తోన్న చిత్రం గార్గి (Gargi). గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమానుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, మేకింగ్ వీడియోలకు అభిమానులనుంచి మంచి స్పందన వచ్చింది. ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం నుంచి తాజాగా బిగ్‌అప్‌డేట్ వచ్చింది. జులైన 15న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు స్వయంగా సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.కాగా ఈ చిత్రాన్ని తమిళంలో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, జ్యోతిక విడుదల చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. కాగా న్యాయ వ్యవస్థ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఆడపిల్లలను చులకనగా చూసే సమాజంలో ఒక ఆడపిల్ల.. తన హక్కుల కోసం పోరాటం చేసే కథగా ఈ సినిమా తెరక్కుతున్నట్లు సినిమా పోస్టర్లు చెప్పకనే చెబుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?