Woman Health: ఆ కారణాలతో.. మహిళల్లో పెరుగుతున్న గుండె సమస్యలు.. తాజా పరిశోధనలో సంచలన విషయాలు..

45 ఏళ్ల తర్వాత, పురుషులు, స్త్రీలలో హృదయ సంబంధ సమస్యలు దాదాపు ఒకే విధంగా ఉంటాయిని కొంతమంది మహిళలు అర్థం చేసుకుంటారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు ప్రమాదం తక్కువగా ఉంటుందని భావించడం సరికాదు..

Woman Health: ఆ కారణాలతో.. మహిళల్లో పెరుగుతున్న గుండె సమస్యలు.. తాజా పరిశోధనలో సంచలన విషయాలు..
Heart Attack
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 05, 2022 | 9:50 PM

Heart diseases in Woman: ఉరుకులు పరుగుల జీవితం, జీవనశైలి కారణంగా మహిళల్లో అనారోగ్య సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో గుండె జబ్బులు పెరుగుతున్నాయని హార్వర్డ్ హెల్త్ అధ్యయనం హెచ్చరించింది. హార్వర్డ్ హెల్త్ అధ్యయనం ప్రకారం.. మహిళల్లో గుండె జబ్బుల మరణాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అత్యధిక మరణాల్లో గుండె జబ్బులు ప్రధాన కారణమని పేర్కొంది. నివారించదగిన వాటిలో ఒకటైనప్పటికీ.. అవగాహన లేమితో గుండె జబ్బులు పెరుగుతున్నాయని తెలిపింది. గుండె జబ్బులలో ముఖ్యంగా లింగ భేదాలను గుర్తించడం, మహిళల్లో రోగ నిర్ధారణ, చికిత్సకు సహాయపడుతుందని పరిశోధన తెలిపింది.

పీరియడ్స్‌కు ముందు మహిళ ఈస్ట్రోజెన్ HDL (మంచి) కొలెస్ట్రాల్‌ను పెంచడం, LDL (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. రుతుక్రమం తర్వాత పురుషుల కంటే స్త్రీలలో మొత్తం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది మాత్రమే పీరియడ్స్ తర్వాత గుండె జబ్బుల ప్రమాదంలో ఆకస్మిక పెరుగుదలను వివరించదు.

ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్స్ మహిళల్లో కార్డియోవాస్కులర్ రిస్క్‌కి ముఖ్యమైన సహకారం చేకూరుస్తుంది. తక్కువ హెచ్‌డీఎల్, అధిక ట్రైగ్లిజరైడ్‌లు మాత్రమే 65 ఏళ్లు పైబడిన మహిళల్లో గుండె జబ్బుల నుంచి మరణించే ప్రమాదాన్ని పెంచే కారకాలుగా కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ కార్డియాక్ సైన్సెస్ చైర్మన్ డాక్టర్ అజయ్ కౌల్ న్యూస్9తో ప్రత్యేకంగా మాట్లాడారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే గుండె జబ్బులు పెరుగుతున్నాయని అన్నారు. రెండవది.. 45 ఏళ్ల తర్వాత, పురుషులు, స్త్రీలలో హృదయ సంబంధ సమస్యలు దాదాపు ఒకే విధంగా ఉంటాయిని కొంతమంది మహిళలు అర్థం చేసుకుంటారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు ప్రమాదం తక్కువగా ఉంటుందని భావించడం సరికాదని డాక్టర్ కౌల్ చెప్పారు.

మహిళల్లో గుండెపోటుకు సంబంధించిన సాధారణ లక్షణాలు పురుషుల కంటే భిన్నంగా ఉంటాయని ఆయన తెలిపారు. ‘‘పురుషులలో సాధారణంగా కనిపించే ఛాతీ నొప్పి, వికారం, గుండెలో మంట లాంటివి మహిళల్లో కనిపించవు’’ అని డాక్టర్ కౌల్ చెప్పారు.

మహిళల్లో గుండెపోటు లక్షణాలు

  • అలసట
  • భోజనం తర్వాత అసౌకర్యంగా ఉన్న భావన
  • దవడలో, శరీర వెనుక భాగంలో కూడా ఒక విచిత్రమైన నొప్పి
  • ఎడమ, కుడి చేతిలో నొప్పి
  • మెట్లు ఎక్కేటప్పుడు, ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత ఊపిరి ఆడకపోవడం
  • తిన్న తర్వాత కడుపు నొప్పి లేదా పొత్తికడుపు పైభాగంలో నొప్పి గుండె సంబంధిత సమస్య వల్ల కావచ్చు
  • కారణం లేకుండా విపరీతమైన చెమట

‘‘ఇవన్నీ మహిళల్లో గుండె సమస్యలకు సూచనలు. అయితే, గుండె జబ్బుల నిర్ధారణ, చికిత్స పురుషులు, స్త్రీలకు ఒకే విధంగా ఉంటుంది’’ అని డాక్టర్ కౌల్ వివరించారు.

ఊబకాయం, పెరిగిన రక్తపోటు, గ్లూకోజ్ హెచ్చుతగ్గులు, తక్కువ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్, అధిక ట్రైగ్లిజరైడ్‌లు.. గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం వచ్చే అవకాశాలను పెంచుతాయని అధ్యయనం తెలిపింది. మహిళలకు, అసాధారణంగా చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి మెటబాలిక్ సిండ్రోమ్ అత్యంత ముఖ్యమైన ప్రమాద కారకం. బైపాస్ సర్జరీ చేయించుకుంటున్న రోగులపై జరిపిన ఒక అధ్యయనంలో, మెటబాలిక్ సిండ్రోమ్ ఎనిమిది సంవత్సరాలలోపు మరణించే పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది.

మధుమేహం పురుషులలో కంటే మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. బహుశా మధుమేహం ఉన్న స్త్రీలు తరచుగా ఊబకాయం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి ప్రమాద కారకాలు ఉండటం వల్ల కావచ్చు. పురుషుల కంటే 10 సంవత్సరాల తరువాత స్త్రీలు సాధారణంగా గుండె జబ్బులను అభివృద్ధి చేసినప్పటికీ, మధుమేహం ఆ ప్రయోజనాన్ని తొలగిస్తుంది. ఇప్పటికే గుండెపోటు ఉన్న మహిళల్లో, మధుమేహం రెండవ గుండెపోటు ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. దీంతో గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.

‘‘అందువలన మహిళలందరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. 40 సంవత్సరాల వయస్సు నుంచి వారు తమ పూర్తి ప్రొఫైల్‌ను తప్పనిసరిగా చెక్ చేయించుకోవాలి. లిపిడ్, బ్లడ్ షుగర్, KFT, LFT వంటి వాటిని పరీక్షించుకోవాలి. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే కుటుంబంలో స్త్రీ తప్పనిసరిగా కార్డియాలజిస్ట్‌ని సందర్శించాలి అని డాక్టర్ కౌల్ సలహా ఇచ్చారు.

పురుషుల కంటే 10 సంవత్సరాల తరువాత స్త్రీలు సాధారణంగా గుండె జబ్బులను, మధుమేహం లాంటి వాటిని కలిగి ఉంటున్నారు. దీనికి హార్మోన్లలో మార్పులు, పీరియడ్స్ 1:1 నిష్పత్తిలో ఉండటానికి ప్రధాన కారణం అని డాక్టర్ కౌల్ చెప్పారు. ‘‘అప్పుడు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ వంటి ఇతర సమస్యలు ఉన్నాయి. ఇది ఎక్కువగా మహిళలను ప్రభావితం చేస్తుంది; ప్రధాన కారణం అధిక ఒత్తిడి, వారి గుండె దానిని తట్టుకోలేకపోవడమే” అని డాక్టర్ కౌల్ చెప్పారు.

మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి..

1. మహిళకు 30-35 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత మధుమేహం, రక్తపోటు, అస్థిరమైన నిద్ర విధానాలు లేవని నిర్ధారించుకోవడానికి ప్రాథమిక పరీక్షలు చేయించుకోవాలి.

2. ఐటీ రంగంలో పనిచేసే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిశ్రమలో పనిచేసే మహిళలు సమయానికి నిద్రపోవడానికి పెద్ద సమస్యలను ఎదుర్కొంటారు. రాత్రంతా పని చేయడం, ఉదయం నిద్రపోవడం గుండె జబ్బులకు దారితీస్తుంది.

3. మధుమేహం ఉన్న స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. హైపర్‌టెన్షన్, అధిక కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు సైలెంట్ కిల్లర్స్. ఒక పేషెంట్ తనకు ఈ అనారోగ్య పరిస్థితులు ఉన్నాయని.. చెక్-అప్ చేయించుకుంటే తప్ప ఎప్పటికీ గ్రహించకపోవచ్చు. మధుమేహం మూత్రపిండాలు, కాలేయంపై మాత్రమే కాకుండా, గుండెపై కూడా ప్రభావం చూపుతుంది.

4. మీ బరువుపై దృష్టిపెట్టండి. జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన ఆహారం, స్వీట్లు తినడం మానుకోండి. మీరు ఎన్ని కేలరీలు తీసుకుంటున్నారో తనిఖీ చేయడం ముఖ్యం.

5. చాలా మంది మహిళలు ఆందోళన లేదా ఒత్తిడి కారణంగా తగినంత నిద్ర పొందలేక ఒత్తిడికి గురవుతారు కాబట్టి, వీటిని తగ్గించుకోవడానికి చర్యలు తీసుకోవాలి.

Source Link

హెల్త్ వార్తల కోసం

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!