Milk in Diabetes: షుగర్ బాధితులకు పాలు మేలు చేస్తాయా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..

మధుమేహంతో బాధపడుతున్న వారు రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండటానికి, ఆహారంలో ఏమి చేర్చుకోవాలి.. ఎలాంటివి చేర్చుకోకూడదు అనే విషయంపై అవగాహనతో ఉండటం అవసరం.

Milk in Diabetes: షుగర్ బాధితులకు పాలు మేలు చేస్తాయా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
Milk
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 05, 2022 | 7:20 PM

Milk and Diabetes: ప్రస్తుత కాలంలో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ పేషెంట్లు ముఖ్యంగా తీసుకునే ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. మధుమేహంతో బాధపడుతున్న వారు రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండటానికి, ఆహారంలో ఏమి చేర్చుకోవాలి.. ఎలాంటివి చేర్చుకోకూడదు అనే విషయంపై అవగాహనతో ఉండటం అవసరం. ఇలాంటి పరిస్థితిలో అందరి ప్రశ్న ఏమిటంటే.. పాలలో చక్కెర కలిపి తాగవచ్చా? పాలు ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరం, కానీ మధుమేహంలో దీనిని తగ్గించడం లేదా తీసుకోకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పాలు పంచదార కలిపి తాగవచ్చా..?

ఆరోగ్య నిపుణులు, డైటీషియన్ల ప్రకారం మధుమేహం ఉన్నవారు పాలు పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చు. అయితే, ఎప్పుడూ పూర్తి క్రీమ్ పాలు తాగకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎల్లప్పుడూ టోన్డ్ లేదా ఆవు పాలు తాగాలి. అలాగే రాత్రి పడుకునే ముందు పాలు తాగకూడదు. ఒకవేళ తాగాలనుకుంటే.. పడుకునే 1 లేదా 2 గంటల ముందు పాలు తాగాలి.

ఇవి కూడా చదవండి

డయాబెటిస్‌ బాధితులు ఈ విషయాలను తెలుసుకోండి..

  • మధుమేహ వ్యాధిగ్రస్తులు నిద్రపోయే ముందు లేదా పడుకునే ముందు పాలు తాగవద్దు.
  • నిద్రించడానికి, పాలు తాగడానికి మధ్య కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలి.
  • పూర్తి క్రీమ్ పాలు తాగడం మానుకోండి. ఇది చాలా కొవ్వును కలిగి ఉంటుంది, దీని కారణంగా కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.
  • రోజంతా 1 గ్లాసు కంటే ఎక్కువ పాలు తాగవద్దు.
  • అదే సమయంలో, సాధారణ పాలకు బదులుగా, పాలలో పసుపు లేదా దాల్చిన చెక్కను కలిపి తాగవచ్చు. ఇది వ్యాధులను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ వార్తల కోసం