Zika Virus: అలర్ట్.. దేశంలో పెరుగుతున్న జీకా వైరస్ కేసులు.. తెలంగాణలోనూ వ్యాప్తి..

జీకా వైరస్ దేశవ్యాప్తంగా వ్యాపించిందని.. తక్షణమే చర్య అవసరం ఉందని అధ్యయనం హెచ్చరించింది. పరిశోధనలో భాగంగా మొత్తం 1475 నమూనాలను పరీక్షించగా..

Zika Virus: అలర్ట్.. దేశంలో పెరుగుతున్న జీకా వైరస్ కేసులు.. తెలంగాణలోనూ వ్యాప్తి..
Zika Virus
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 06, 2022 | 4:11 PM

Zika Virus Cases in India: భారత్‌లో ప్రమాదకర జీకా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేసులు నమోదవుతుండటంతో ఆందోళన నెలకొంది. అన్ని ప్రాంతాల్లో వ్యాప్తి పెరిగే అవకాశమందని పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) హెచ్చరించింది. జీకా వైరస్‌పై చేపట్టిన అధ్యయనం వివరాలను మెడికల్ జర్నల్ ఫ్రాంటియర్ ఇన్ మైక్రోబయాలజీ లో ఇటివలే ప్రచురించింది. జీకా వైరస్ దేశవ్యాప్తంగా వ్యాపించిందని.. తక్షణమే చర్య అవసరం ఉందని అధ్యయనం హెచ్చరించింది. పరిశోధనలో భాగంగా మొత్తం 1475 నమూనాలను పరీక్షించగా.. అందులో 64 నమూనాలు పాజిటివ్‌గా తేలాయని ఎన్ఐవీ వెల్లడించింది. గతంలో బారిన పడిన వ్యక్తుల నుంచి క్రమంగా ఇతరులకు వ్యాప్తి చెందుతోందని.. ఇలా దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకూ ఈ వైరస్ విస్తరించినటగ్లు ఐసీఎంఆర్ పేర్కొంది.

వర్షకాలం ప్రారంభకావడంతో జీకా వైరస్‌తోపాటు దోమకాటు వలన వ్యాపించే డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధులు పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. 2017-2021 మధ్య కాలంలో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని ఐసీఎంఆర్-ఎన్ఐవీ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ప్రజ్ఞా యాదవ్ చెప్పారు. ఇప్పటికే ఢిల్లీ, రాంచీ (జార్ఖండ్), జోధ్‌పూర్(రాజస్థాన్), అమృత్‌సర్ (పంజాబ్), హైదరాబాద్ (తెలంగాణ), తిరువనంతపురం (కేరళ), పుణె (మహారాష్ట్ర), అలీగఢ్, కాన్పూర్ (ఉత్తరప్రదేశ్) లలో జీకా వైరస్ కేసులు నిర్ధారణ అయ్యాయని ఐసీఎంఆర్ పేర్కొంది.

తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సేకరించిన ఒక నమూనాలో జీకా వైరస్ నిర్ధారణ అయినట్లు తెలిపింది. కాగా.. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీకా వైరస్ వ్యాప్తి జరుగుతోంది. జీకా వైరస్ దోమలు వంటి కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధి. జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, కీళ్లు, కండరాల నొప్పులు ఈ వ్యాధి లక్షణాలు. డెంగ్యూ మాదిరిగానే ఈ వైరస్ కూడా చాలా ప్రమాదకరం కావున దీనిని నుంచి రక్షణ పొందే మార్గాలను అనుసరించాలని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ