Hyderabad: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ జాబ్‌, నెలకు రూ. 3 లక్షల జీతం.. ఆశ పడ్డారో మీ పని గోవిందా..

Hyderabad: పోలీసులు, ప్రభుత్వాలు, మీడియా ఎన్ని రకాలుగా ప్రచారాలు చేస్తున్న మోసాలు మాత్రం ఆగడంలేవు. బాధితుల అత్యాశనే పెట్టుబడిగా మార్చుకొని కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. తాజాగా ఇలాంటి...

Hyderabad: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ జాబ్‌, నెలకు రూ. 3 లక్షల జీతం.. ఆశ పడ్డారో మీ పని గోవిందా..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 06, 2022 | 4:42 PM

Hyderabad: పోలీసులు, ప్రభుత్వాలు, మీడియా ఎన్ని రకాలుగా ప్రచారాలు చేస్తున్న మోసాలు మాత్రం ఆగడంలేవు. బాధితుల అత్యాశనే పెట్టుబడిగా మార్చుకొని కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘరాన మోసం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. డిజినల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ పేరుతో ఓ సంస్థ ఏకంగా 700 మందిని ముంచేసింది.

వివరాల్లోకి వెళితే.. అమిత్‌ శర్మ అనే వ్యక్తి.. డిజినల్‌ ఇండియా ప్రైవేటు కంపెనీ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. అమెరికా బేస్‌డ్‌ కంపెనీ అని నమ్మబలికాడు. ఉద్యోగం ఆన్‌లైన్‌లోనే ఉంటుందని, వర్క్‌ ఫ్రం హోం విధానంలో జాబ్‌ ఉంటుందని ప్రచారం చేశాడు. నెలకు రూ. 3 లక్షలకుపైగా జీతం ఉంటుందని నమ్మబలికాడు. అయితే ఉద్యోగంలో చేరాలంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని కండిషన్‌ పెట్టాడు. ఇచ్చిన బుక్స్ ను కేవలం స్కానింగ్ చేసిన పంపిచడమే ఉద్యోగమని చెప్పాడు.

దీంతో వెనకా ముందు ఆలోచించని జనాలు ఎగబడి లక్షలు సమర్పించుకున్నారు. ఇలా అమిత్‌ శర్మ ఏకంగా 700 మంది నుంచి రూ. 30 కోట్ల రూపాయల డిపాజిట్‌లను రాబట్టి జెండా ఎత్తేశాడు. మోసపోయామని తెలిసిన బాధితులు ఎండీ అమిత్‌ శర్మపై సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..