G 20 Summit: మోడీ నయా స్కెచ్‌.. జీ-20 సదస్సుకు ఏర్పాట్లు.. విలవిలలాడుతున్న చైనా, పాకిస్తాన్‌

G-20 Summit: వచ్చే ఏడాది జమ్మూకశ్మీర్‌లో లఢక్‌లో జి-20 సమావేశాలను నిర్వహించేందుకు భారత్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ అందాల కశ్మీరం ఓ ప్రతిష్ఠాత్మక..

G 20 Summit: మోడీ నయా స్కెచ్‌.. జీ-20 సదస్సుకు ఏర్పాట్లు.. విలవిలలాడుతున్న చైనా, పాకిస్తాన్‌
Follow us
Subhash Goud

|

Updated on: Jul 06, 2022 | 9:23 PM

G-20 Summit: వచ్చే ఏడాది జమ్మూకశ్మీర్‌లో లఢక్‌లో జి-20 సమావేశాలను నిర్వహించేందుకు భారత్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ అందాల కశ్మీరం ఓ ప్రతిష్ఠాత్మక సదస్సుకు వేదిక కానుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతలు కలిగిన జీ 20 కూటమి శిఖరాగ్ర సమావేశానికి జమ్ముకశ్మీర్‌ (Jammu Kashmir) ఆతిథ్యమివ్వనుంది. భారత్‌ దేశంలో తొలిసారిగా జీ 20 సదస్సు 2023లో జరుగనుంది. ఈ సమావేశాలను హోస్ట్‌ చేసేందుకు జమ్మూకశ్మీర్‌, ఢిల్లీల నుంచి ఇద్దరు నోడల్‌ ఆఫీసర్లను ఎంపిక చేసింది కేంద్రం. ఈ G-20 శిఖరాగ్ర సమావేశానికి భారత్‌ అతిథ్యమివ్వనుంది. దీంతో జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న మొదటి అతిపెద్ద సదస్సు ఇదే కావడం విశేషం.

అయితే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమూహం అయిన G-20 సమావేశాలు జరగనున్నాయి. 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో తొలి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం ఇదే. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న 19 దేశాలతో పాటు ఐరోపా సమాఖ్య(Europian Union)కు చెందినే దేశాల ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సమావేశాల మొత్తం సమన్వయం కోసం కేంద్రం.. ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. జీ 20 సమ్మిట్ సక్సెస్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. ఈ కమిటీలో రవాణా శాఖకు చెందిన కమిషనర్ సెక్రటరీ, టూరిజం శాఖకు చెందిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, హాస్పిటాలిటీ విభాగానికి చెందిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, సాంస్కృతిక విభాగానికి చెందిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు. గత సంవత్సరం సెప్టెంబరులో, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ G20 కోసంసమావేశానికి భారత ప్రతినిధిగా ఎంపికయ్యారు. ఈ ఏడాది జీ 20 సమావేశానికి భారత్ తరపున ఎవరు అధ్యక్షత వహిస్తారో డిసెంబర్ 1వ తేదీన నిర్ణయిస్తామని భారత విదేశాంగ మంత్రి వెల్లడించారు.

ఈ జీ-20 సమావేశాలను పాకిస్తాన్‌, చైనా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. గతంలో లడఖ్‌ సరిహద్దుల్లో ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఈ సమావేశాలు నిర్వహిస్తుండటం మరింత ప్రాధాన్యత చోటు చేసుకుంది. 2020లో గాల్వాన్‌ లోయలో భారత్‌-చైనాల మధ్య జరిగిన ఘోరమైన ఘర్షణ తర్వాత యూనియన్‌ టెరిటరీలో సుదీర్ఘ సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ సమావేశాలకు హోస్ట్‌ చేసేందుకు లడఖ్‌ పరిపాలన కమీషనర్‌, సెక్రటరీ, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ లడఖ్‌ డివిజన్‌ కమిషన్‌గా ఉన్న సౌగత్‌ బిస్వాస్‌, లెహ్‌-కార్గిల్‌ రేంజ్‌ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ షేక్‌ జునైద్‌ మహ్మద్‌లను నోడల్‌ ఆఫీసర్‌లుగా నియమించింది.

ఇవి కూడా చదవండి

అయితే జీ 20 సభ్యదేశాల్లో ఒకటి ప్రతి యేటా డిసెంబర్‌లో సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది. ఈ క్రమంలో భారత్‌కు జీ 20 అధ్యక్షత బాధ్యలు ఈ ఏడాది డిసెంబర్‌ 1న లభిస్తాయి. ఇందులో భాగంగా 2023 నవంబర్‌ 30 వరకు కూటమికి సమావేశాలకు సంబంధించిన వ్యవహారాలను భారత్‌ నిర్వర్తిస్తుంది. దీంతో వచ్చే ఏడాది న‌వంబ‌ర్ 30 నుంచి డిసెంబ‌ర్ ఒక‌టి వ‌ర‌కు జ‌రిగే జీ-20 శిఖరాగ్ర స‌ద‌స్సుకు భార‌త్ ఆతిథ్యం ఇవ్వనుంది. దాని నిర్వహ‌ణ‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు, వివిధ విధాన నిర్ణయాల అమ‌లుకు వెసులుబాటు క‌ల్పించ‌డం కోసం సెక్రటేరియ‌ట్ ఏర్పాటు చేయ‌డానికి కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ G20 సమావేశాలను పాక్‌, చైనాలు వ్యతిరేకిస్తున్నాయి. అంతకు ముందు చైనా ప్రభుత్వ మీడియా కూడా జమ్మూలో నిర్వహించే జీ-20 సమావేశాల ప్రణాళికను పునః పరిశీలించాలని భారత్‌ను కోరింది. భారత్ తీసుకున్న ఏకపక్ష చర్యలు వివాదాన్ని తీవ్రతరం చేయడానికి, ఘర్షణలను ప్రేరేపిస్తాయని తెలిపింది. సమావేశాలు నిర్వహించడం తమకు వ్యతిరేకంగా ఉందని చైనీస్‌ కమ్యూనిటీ పార్టీ మౌత్‌పీస్‌ గ్లోబల్‌ టైమ్స్‌ ఇటీవల తెలిపింది.

యూరోపియన్‌ యూనియన్‌, ప్రపంచంలోని 19 ఎమర్జింగ్‌ ఎకనామీల నాయకులను ఒకచోట చేర్చే G-20 శిఖరాగ్ర సమావేశానికి భారత్‌ అతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది ఈ శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?