Health: శృంగారం చేస్తుండగా చనిపోయిన యువకుడు.. అసలెందుకు అలా జరిగింది..? నిపుణులు ఏమంటున్నారంటే..
ఇద్దరు సన్నిహితంగా ఉన్న సమయంలో పార్టేకి స్పృహ కోల్పోయాడని మహిళ పోలీసులకు తెలిపింది. ఈ సందర్భంలో ఎలాంటి డ్రగ్స్‌కు సంబంధించిన ఆధారాలు కూడా కనుగొనలేదని పోలీసులు తెలిపారు.
Man dies during sexual intercourse: మహారాష్ట్రలో ఇటీవల విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడు తన ప్రియురాలితో లైంగిక సంబంధంలో ఉండగా గుండెపోటుతో మరణించాడు. మృతుడు అజయ్ పార్టేకి.. ఆదివారం ఈ సంఘటన జరిగినప్పుడు తన స్నేహితురాలిని (మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలోని నర్సు) సావోనర్ (నాగ్‌పూర్ జిల్లా)లోని లాడ్జిలో కలిశాడు. ఇద్దరు సన్నిహితంగా ఉన్న సమయంలో పార్టేకి స్పృహ కోల్పోయాడని మహిళ పోలీసులకు తెలిపింది. ఈ సందర్భంలో ఎలాంటి డ్రగ్స్‌కు సంబంధించిన ఆధారాలు కూడా కనుగొనలేదని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదికలో గుండెపోటు వచ్చే అవకాశం ఉందని తేలింది. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు కేసు నమోదైంది.
లైంగిక సంపర్కం వంటి తీవ్రమైన కార్యకలాపాల సమయంలో ఒక వ్యక్తి చనిపోతాడని మేదాంత మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నరేష్ ట్రెహాన్ News9 కి చెప్పారు. ‘‘ఇది జాగింగ్ లాంటిది. ఒక వ్యక్తి సెక్స్ చేస్తున్నప్పుడు శరీరాన్ని ఒత్తిడికి గురిచేస్తే, గుండె ఆగిపోయే అవకాశం ఉంది’’ అని డాక్టర్ ట్రెహాన్ చెప్పారు.
సంభోగం సమయంలో గుండె, శరీరం వేగంగా కదులుతాయన్నారు. ‘‘గుండె వ్యవస్థలోకి ఎక్కువ రక్తాన్ని పంప్ చేయగలిగితే అంతా బాగుంటుంది. సెక్స్ సమయంలో, రక్తంలో ఆక్సిజన్‌కు డిమాండ్ పెరుగుతుంది. కానీ ధమను (గుండె)లో అడ్డంకులు ఉంటే వ్యక్తి ఇలాంటి పరిస్థితులకు గురవుతాడు’’ అని డాక్టర్ ట్రెహాన్ చెప్పారు.
అయితే, శృంగారంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి చనిపోవడం ఇదే మొదటిసారి కాదు. జనవరి 2021లో 35 ఏళ్ల వ్యక్తి సెక్స్ వర్కర్‌తో లైంగిక సంబంధం పెట్టుకుని చనిపోయాడు. పోస్ట్‌మార్టం రిపోర్టు ‘‘అత్యంత ఉద్వేగం’’ మరణానికి కారణమని పేర్కొంది. మలావిలోని ఫాలోంబేలో సెక్స్ చేసిన తర్వాత వ్యక్తి స్పృహ కోల్పోయాడు. కొద్దిసేపటికే మరణించాడని ది సన్ నివేదిక పేర్కొంది.
మే 2022లో ముంబైలో 61 ఏళ్ల వ్యక్తి తన భాగస్వామితో లైంగిక సంబంధంలో ఉండగా స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు.
డాక్టర్ ట్రెహాన్ మాట్లాడుతూ.. అసహజ మరణానికి ఎల్లప్పుడూ అవకాశం ఉంటుందని, తీవ్ర ఉద్రేకం, హృదయ సంబంధిత సమస్యలున్న వ్యక్తులు కూడా గుండెపోటుతో చనిపోవచ్చు. ‘తీవ్రమైన కార్యంలో ఉన్న వ్యక్తికి క్రమరహిత హృదయ స్పందన ఉంటుంది, ఎందుకంటే శరీరం ఉద్రేకం, ఎలక్ట్రికల్ వ్యవస్థ ఎటువంటి అడ్డంకులు లేకుండా కూడా ఉండదు. కండరాలు, గుండె జబ్బులు ఉన్నవారు కూడా హాని కలిగి ఉంటారు’’ అని చెప్పారు.
గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్న వ్యక్తులు
- అంతర్లీన గుండె జబ్బులు ఉన్నవారు
- గుండె జబ్బుల కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులు
- ఒక వ్యక్తికి అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఇలా జరుగుతుంది
- ధూమపానం చేసేవారు కూడా గుండె జబ్బులకు గురవుతారు
- ఊబకాయం, నిశ్చల జీవనశైలి దోహదం చేస్తాయి
- ఆందోళన, ఒత్తిడి
‘‘ఒక వ్యక్తికి గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉంటే, అతను/ఆమె 25 సంవత్సరాల వయస్సులో తప్పనిసరిగా చెక్-అప్ చేయించుకోవాలి. చరిత్ర లేకుంటే అలాంటి వ్యక్తులు 30 ఏళ్లలోపు పూర్తి శరీరాన్ని తనిఖీ చేయించుకోవాలి. ఈ విధంగా ఆ వ్యక్తికి పూర్తిగా తెలుస్తుంది. ఏదైనా శ్రమతో కూడిన కార్యకలాపాన్ని చేస్తున్నప్పుడు సంభవించే ఏవైనా సమస్యల గురించి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. అప్పుడు ప్రమాదంలో ఉన్న వ్యక్తులలో మరొక వర్గం ఉంది.. గుండె కండరాలు మందంగా ఉన్న.. (అరుదుగా, దానితో జన్మించినవారు) అటువంటి వ్యక్తులకు సాధారణంగా వారి పరిస్థితి గురించి తెలియదు. ఇలా ఆకస్మికంగా చనిపోవచ్చు. కాబట్టి, మీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం చాలా ముఖ్యం.. ఏ చర్య చేయాలి, ఎక్కడ సంయమనం పాటించాలి..’’ అనేది పూర్తిగా తెలుస్తుందని డాక్టర్ ట్రెహాన్ ముగింపులో తెలిపారు.