Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఇదేం కక్కుర్తి రా నాయనా..! ఆ ఆర్డర్లు ఇచ్చే వారికి ఏసీ పనిచేయదట.. రెస్టారెంట్లో వింత కండీషన్..

హోటల్లో బిర్యానీ తింటే కోక్ లేదా పెప్సీ ఉచితమన్న ప్రకటనలు కూడా మీరు చూసే ఉంటారు. అయితే.. ఓ వ్యక్తి తన రెస్టారెంట్లో పెట్టుకున్న ఓ ప్రకటన కస్టమర్లను విస్తుపోయేలా చేస్తోంది.

Viral News: ఇదేం కక్కుర్తి రా నాయనా..! ఆ ఆర్డర్లు ఇచ్చే వారికి ఏసీ పనిచేయదట.. రెస్టారెంట్లో వింత కండీషన్..
Viral News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 06, 2022 | 8:15 PM

Restaurant rule: తమ వ్యాపార వృద్ధి కోసం కొందరు వినూత్న పంథాను ఎంచుకోవడం సహజమే.. కేజీ చికెన్ కొంటే.. నాలుగు నాలుగు కోడిగుడ్లు ఉచితమన్న ప్రకటనలను చికెన్ షాపుల్లో మనం తరచూ చూస్తూనే ఉంటాం.. హోటల్లో బిర్యానీ తింటే కోక్ లేదా పెప్సీ ఉచితమన్న ప్రకటనలు కూడా మీరు చూసే ఉంటారు. అయితే.. ఓ వ్యక్తి తన రెస్టారెంట్లో పెట్టుకున్న ఓ ప్రకటన కస్టమర్లను విస్తుపోయేలా చేస్తోంది. అయితే.. అతని చేసిన ఈ ప్రకటన వెనుక బలమైన కారణం లేకపోలేదు. కొందరు చిన్న, చిన్న ఆర్డర్లు ఇచ్చి గంటల తరబడి ఏసీ రెస్టారెంట్లో గడపడంతో.. విద్యుత్ బిల్లుల రూపేణా భారీ వ్యయం అవుతుండటాన్ని గ్రహించి ఈ రకమైన ‘కఠిన’ నిర్ణయానికి వచ్చాడు. ప్రస్తుతం ఆ రెస్టారెంట్ ఓనర్ పెట్టిన కండిషన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏం రాశారంటే.. ఎగ్ బుర్జి, కోడిగుడ్డు కర్రీ, ఎగ్ ఆమ్లెట్, 250 గ్రాముల చికెన్ పకోడీ ఆర్డర్లపై ఏసీ ఆన్ చేయమంటూ ఎలాంటి మొహమాటం లేకుండా కస్టమర్లకు తేల్చిచెప్పాడు. అంటే చిన్న ఆర్డర్లకు ఏసీ పనిచేయదని.. ఏసీ ఆన్ కావాలంటే భారీ ఆర్డర్లు ఇవ్వాల్సిందేనని చెప్పకనే చెప్పేశాడు.

ఈ ఫొటోపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. కొందరు రెస్టారెంట్ యజమాని నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం మరీ అలాంటి నిర్ణయం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. డబ్బే ధ్యేయం అన్నట్లు ప్రవర్తిస్తే వచ్చే కస్టమర్లు కూడా రారంటూ రెస్టారెంట్ యజమానికి వార్నింగ్ ఇస్తున్నారు. మరికొందరు మాత్రం సొల్లు కబుర్లు చెబుతూ రెస్టారెంట్లలో గంటలు గంటలు గడిపే వారిని ఎదుర్కొవాలంటే ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదని పేర్కొంటున్నారు. వేల రూపాయిలు సంపాదిస్తూ ఏసీ విషయంలో కక్కుర్తి ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.

Ac

Ac

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో.. పంజాబీ భాషలో రాసి ఉంది. పోస్టర్ చూసిన తర్వాత పంజాబ్‌లోని ఓ రెస్టారెంట్‌కి చెందినదిగా అనిపిస్తోంది. అయితే ఈ ఫోటో ఎవరు తీశారు, ఎక్కడ తీశారు అనేది తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..