Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి.. సంతోషం శృతి తప్పితే ఇలానే ఉంటుంది.. వీడియో

పటాకులు పేల్చడం సరదా అయినప్పటికీ.. అవి చాలా ప్రమాదకరమైనవి. పటాకులు పేల్చే క్రమంలో వెలువడే చిన్న చిన్న నిప్పు రవ్వలు... ప్రమాదకరంగా మారుతాయి.

Viral Video: అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి.. సంతోషం శృతి తప్పితే ఇలానే ఉంటుంది.. వీడియో
Viral News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 06, 2022 | 6:37 PM

Shocking Video: సాధారణంగా ఏ పండుగకైనా, శుభాకార్యమైనా పటాకులు కాల్చుతూ ఆనందంగా గడుపుతారు. ఎక్కువగా పెళ్లిళ్లలో, ఎన్నికలలో కూడా పటాకులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తారు. అయితే.. పటాకులు పేల్చడం సరదా అయినప్పటికీ.. అవి చాలా ప్రమాదకరమైనవి. పటాకులు పేల్చే క్రమంలో వెలువడే చిన్న చిన్న నిప్పు రవ్వలు… ప్రమాదకరంగా మారుతాయి. కొన్నిసార్లు ప్రజల ఇళ్లు కూడా దగ్ధమవుతాయి. మరికొన్ని సార్లు భారీ ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఒక్క చిన్న పొరపాటు.. పెను ప్రమాదంగా మారుతుంది. ప్రస్తుతం అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. బాణసంచా కాలుస్తారు. సంతోషంలో బాణాసంచా కాల్చగా ఘోర ప్రమాదం జరిగింది. దీంతో అక్కడున్న వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన పటాకులు పేల్చేందుకు ప్రయత్నిస్తుండటాన్ని మీరు చూడవచ్చు. వారి వెనుక కొందరు చిన్నారులు సహా మహిళలు కుర్చీలపై హాయిగా కూర్చోని ఉన్నారు. పటాకులకు మంటలు అంటుకోవడంతోనే కాల్చిన వారు వెంటనే అక్కడి నుంచి పరిగెత్తారు. ఈ సమయంలో పటాకులు పెలగానే.. నిప్పు రవ్వలు కుర్చీలపై కూర్చున్న మహిళల వైపు దూసుకువస్తాయి. దీంతో వారు అప్రమత్తమై పక్కకు వెళ్తారు. పటాకులన్నీ పేలడం ప్రారంభంకాగానే.. కారు దగ్గర భారీగా పేలుళ్లు సంభవిస్తాయి. దీంతో అందరూ ప్రాణాలకు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తారు. ఈ భీకర మంటలతో కార్లు డ్యామేజ్ అయినట్లు కనిపిస్తోంది.

వైరల్ వీడియో..

ఇవి కూడా చదవండి

Redditలో షేర్ చేసిన ఈ 31 సెకన్ల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది మూర్ఖత్వపు చేష్టలని కొందరు పేర్కొనగా.. చిన్న పిల్లలున్న చోట అప్రమత్తంగా ఉండాలని మరికొందరు పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..