Egg Benefits: గుడ్డులోని పచ్చసొన గుండె ఆరోగ్యానికి మంచిదా..? కాదా..? ఇదిగో క్లారిటీ
Egg Benefits: గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం అందరికి తెలిసిందే. ప్రతి రోజు గుడ్డు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సైతం సూచిస్తుంటారు. గుడ్డు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. వైద్య నిపుణులు అందించిన వివరాల ప్రకారం.. కోడి గుడ్డును ప్రతిరోజు తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన శక్తితోపాటు, మాంసకృత్తులు అందుతాయి. కండ నిర్మాణానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఉడికించిన కోడి […]
Egg Benefits: గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం అందరికి తెలిసిందే. ప్రతి రోజు గుడ్డు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సైతం సూచిస్తుంటారు. గుడ్డు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. వైద్య నిపుణులు అందించిన వివరాల ప్రకారం.. కోడి గుడ్డును ప్రతిరోజు తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన శక్తితోపాటు, మాంసకృత్తులు అందుతాయి. కండ నిర్మాణానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఉడికించిన కోడి గుడ్డులో ప్రొటీన్స్, క్యాలరీలు అధికంగా ఉంటాయి. అయితే చాలా మంది కోడి గుడ్డులోని పచ్చసొనను తినేందుకు ఏమాత్రం ఇష్టపడరు. పచ్చసొన తినటం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని చాలా మంది భావిస్తుంటారు. అలా అనుకోవడం కేవలం అపోహా మాత్రమేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పచ్చసొన తింటే గుండె జబ్బులు వచ్చేస్తాయన్న ప్రచారం ఉండటంతో ఇటీవల ఇన్‌స్టా్గ్రామ్‌లో డైటీషియన్ మాక్ సిగ్ క్లారిటీ ఇచ్చారు. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉందనేది అపోహా మాత్రమేనని, దానిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించదని అన్నారు. గుడ్డులోని తెల్లసొనతో పోల్చితే పచ్చసొన ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిపారు.
పచ్చసొనతో ప్రయోజనాలు..
ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గేందుకు ప్రోత్సహిస్తుంది. కంటి వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు గుడ్డులోని తెల్లసొనలో గణనీయమైన ప్రోటీన్స్ ఉన్నాయి. రోజుకు రెండు గుడ్ల సొనలు తినవచ్చని, ఏదైనా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి రోజుకు ఒక పచ్చసొన తినవచ్చని పేర్కొన్నారు. ఇందులో ప్రోటీన్స్‌తో పాటు ఒమేగా-3 కొవ్వులతో సహా గుండె ఆరోగ్యంగా ఉంచేందుకు సంతృప్తికరమైన కొవ్వును కూడా కలిగి ఉంటుందన్నారు.
View this post on Instagram
అయితే వాస్తవానికి గుడ్డులోని పచ్చసొనలో జీవక్రియకు అవసరమైన అమైనో అమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్ ఎ, డి, బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్డును ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఎదుగుతున్న చిన్నారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. మానసిక ఎదుగుదల తోపాటు, చురుకుగా ఉండేందుకు దోహదం చేస్తుంది. గుడ్డులో ఉండే పచ్చసొనలో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత సమస్యలు దూరమవుతాయి. పచ్చసొన తీసుకోవడం వల్ల గుండెకు ఎలాంటి హానీ ఉండని స్పష్టం చేస్తున్నారు.