Lalu Prasad Yadav: క్షీణించిన లాలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. తేజస్వీకి ఫోన్ చేసిన ప్రధాని మోడీ..
ఢిల్లీకి తరలించే ముందు ఆస్పత్రిలో లాలు యాదవ్‌ను బీహార్ సీఎం నితీష్ కుమార్ పరామర్శించారు. అయితే చికిత్సకు లాలు యాదవ్ స్పందిస్తున్నారని , త్వరలోనే కోలుకుంటారని ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Lalu Prasad Yadav to be airlifted to Delhi: బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్ (RJD) అధినేత లాలు ప్రసాద్ యాదవ్ (74) ఆరోగ్యం మరింత క్షీణించింది. బుధవారం లాలును పాట్నా నుంచి హుటాహుటిన ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీకి తరలిస్తున్నారు. పాట్నా ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఢిల్లీకి తరలించే ముందు ఆస్పత్రిలో లాలు యాదవ్‌ను బీహార్ సీఎం నితీష్ కుమార్ పరామర్శించారు. అయితే చికిత్సకు లాలు యాదవ్ స్పందిస్తున్నారని , త్వరలోనే కోలుకుంటారని ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం లాలు ప్రసాద్ పరిస్థితి నిలకడగా ఉందని.. ఆయన కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. ఆయనకు అందించాల్సిన వైద్యం గురించి అక్కడి డాక్టర్లకు తెలుసని అందుకే తాము ఢిల్లీకి తరలించినట్లు తేజస్వి యాదవ్ తెలిపారు. అవసరమైతే మెరుగైన చికిత్సం కోసం సింగపూర్ తీసుకెళ్తామని తెలిపారు.
లాలూ సోమవారం వేకువజామున ఇంట్లో మెట్లపై నుంచి కాలుజారి పడిపోడంతో.. కుడి భుజానికి ఫ్రాక్చర్ అయింది. పాట్నాలోని పరాస్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా.. హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్‌కు ఎయిర్ ఆంబులెన్స్‌లో తరలించడంతో ఆయన పరిస్థితి విషమించిందంటూ పుకార్లు మొదలయ్యాయి. వీటిని తేజస్వీ ఖండించారు.
కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ, లాలూ ఆరోగ్యంపై ఆరా తీశారు. తేజస్వీ యాదవ్‌కు ఫోన్ చేసి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానితోపాటు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ కూడా తేజస్వికి ఫోన్ చేసి లాలు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.\
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి