TMC Recruitment 2022: టాటా మెమోరియల్ సెంటర్.. రూ.78,800ల జీతంతో వైజాగ్, ముంబాయి కేంద్రాల్లో ఉద్యోగాలు
టాటా మెమోరియల్ సెంటర్ (TMC Varanasi)కి చెందిన ముంబాయి, విశాఖపట్నం సెటర్లలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్.. అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ సూపరింటెండెంట్ తదితర పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి..
TMC Mumbai Medical and Non Medical Recruitment 2022: టాటా మెమోరియల్ సెంటర్ (TMC Varanasi)కి చెందిన ముంబాయి, విశాఖపట్నం సెటర్లలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్.. అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ సూపరింటెండెంట్ తదితర పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 58
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్, సైంటిఫిక్ ఆఫీసర్, మెడికల్ ఫిజికిస్ట్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్, క్లర్క్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్, అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్ పోస్టులు
విభాగాలు: హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ, హెమటోపాథాలజీ, మెడికల్ ఆంకాలజీ, పల్లియేటివ్ మెడిసిన్, రేడియో డయాగ్నసిస్, సర్జికల్ ఆంకాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: జులై 29, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.19,900ల నుంచి రూ.78,800ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్/బీఏఎంఎస్, ఎమ్మెస్సీ, ఎండీ/ డీఎం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ.300
- ఎస్సీ/ఎస్టీ/మహిళలు/పీడబ్ల్యూడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: జులై 29, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.