July 4th: గూగుల్‌పై నెటిజన్ల ఆగ్రహం.. ఇదేం పద్ధతంటూ ఫిర్యాదులు!

జూలై 4వ తేదీన వెలువడిన గూగుల్ స్పెషల్‌ పేజ్‌ను నెటిజన్లందరూ తెగ తిట్టిపోస్తున్నారు. కారణం ఏంటంటే..

July 4th: గూగుల్‌పై నెటిజన్ల ఆగ్రహం.. ఇదేం పద్ధతంటూ ఫిర్యాదులు!
July 4 Animation Page
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 05, 2022 | 1:27 PM

Google’s July 4 Animation page: జూలై 4వ తేదీన వెలువడిన గూగుల్ స్పెషల్‌ పేజ్‌ను నెటిజన్లందరూ తెగ తిట్టిపోస్తున్నారు. కారణం ఏంటంటే.. చికాగోలో జులై 4న ఓ దుండగుడు ఇండిపెండెన్స్‌ డే పరేడ్‌పై జరిపిన సామూహిక కాల్పుల్లో ఆరుగు మృతి చెందగా.. చిన్నారులతో సహా 30 మంది గాయపడ్డారు. ప్రస్తుతం వారందరూ చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా సోమవారంనాటి గూగుల్‌ స్పెషల్ పేజ్‌లో చికాగో వార్తల కోసం వెదికే యూజర్లకు ఓ వింత పేజీ కనిపించింది. చికాగోలో జరిగిన కాల్పులకు సంబంధించిన తాజా వార్తల పోటో లే అవుట్‌లతో పాటు కలర్‌ఫుల్‌ బాణ సంచాలతో యానిమేషన్‌ను గూగుల్‌ రూపొందించింది. ఇలాంటి విషాదకర సంఘటనలు జరిగినప్పుడు బాణాసంచాలతో సెలబ్రేట్‌ చెయ్యడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. చికాగోలోని హైలాండ్ పార్కులో జరిగిన సామూహిక కాల్పుల్లో మరణించిన వారి గురించి, ప్రాణాపాయంలో ఉన్నవారి గురించిన వార్తలను ప్రస్తావిస్తూ ఉన్న పేజ్‌లో వేడుకగా బాణాసంచా కాల్పుతో కలర్‌ఫుల్‌గా సంబరంలా యానిమేషన్‌ ఇ‍వ్వడం పలువురికి ఆగ్రహం తెప్పించింది. ఈ విషయంపై కోపోద్రిక్తులైన నెటిజన్లు ఫిర్యాదులు కూడా చేశారు.

కాగా అమెరికా దేశ వ్యాప్తంగా జులై 4న స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటోంది. దీనిలో భాగంగా చికాగోలో జరుపుకుంటున్న ఇండిపెండెన్స్‌ పరేడ్‌ గ్రౌండ్‌ పై ఓ దుండగుడు విచక్షణా రహితంగా గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఆరుగు అక్కడికక్కడే మృతి చెందారు. రెండు డజన్ల మందికిపైగా గాయ పడ్డారు.

దీంతో అనేక మంది భయాందోళనలతో పరుగులు తీశారు. కుర్చీలు, బెలూన్లు, ఇతర సామాగ్రి చిందరవందరగా పడిపోయి పరిసర ప్రాంతాలు భయానక వాతావరణాన్ని తలపించాయి. కాల్పుల అనంతరం నిందితుడు రాబర్ట్ క్రిమో (22)ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటువంటి విషాద ఘటనలకు నివాళి అర్పించవల్సిన తీరు ఇదేనా అంటూ గూగుల్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.