AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గాల్లో ఉండగానే విమానానికి రంధ్రం పడింది.. ప్రాణభయంతో ప్యాసింజర్స్, పైలట్లు.. చివరకు..

జులై 1న ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమిరేట్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ380 విమానం‌.. దుబాయ్‌ నుంచి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు బయల్దేరింది.

Viral Video: గాల్లో ఉండగానే విమానానికి రంధ్రం పడింది.. ప్రాణభయంతో ప్యాసింజర్స్, పైలట్లు.. చివరకు..
Viral
Rajitha Chanti
|

Updated on: Jul 05, 2022 | 12:31 PM

Share

విమానం గాల్లో ప్రయాణిస్తుండగానే పెద్ద రంద్రం పడింది. ఈ విషయాన్ని దాదాపు 14 గంటల ప్రయాణం తర్వాత గుర్తించారు పైలట్లు. దీంతో హూటాహుటిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‏ను సంప్రదించారు. చివరకు ఆ విమానాన్ని జాగ్రత్తగా టేకాఫ్ చేశారు.. వివరాల్లోకెలితే.. ఎమిరేట్స్ కు చెందిన ఓ విమానం గాల్లో ఎగురుతుండగా పెద్ద రంద్రం పడింది. దుబాయ్‌ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరిన ఈ విమానం గాల్లో ప్రయాణిస్తుండగా రంధ్రం పడింది. ఈ విషయం పైలట్లు దాదాపు 14 గంటల ప్రయాణం తర్వాత గమనించారు. విమానాశ్రయంలో ఫ్లైట్‌ ల్యాండ్ అయిన తర్వాత ఈ విషయం గుర్తించారు.

జులై 1న ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమిరేట్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ380 విమానం‌.. దుబాయ్‌ నుంచి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు బయల్దేరింది. అయితే, గమ్యానికి చేరుకుని, ఇక కొద్దిసేపట్లో ల్యాండ్‌ అవుతామనగా పైలట్లు.. అక్కడి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ)ను సంప్రదించారు. టేకాఫ్‌ సమయంలో విమానం టైరు పేలిందని అనుమానం వ్యక్తం చేస్తూ.. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి పొందారు. సురక్షితంగా ల్యాండ్‌ అయ్యాక.. విమానం ఎడమ రెక్క వైపు కింది భాగంలో రంధ్రాన్ని గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం విమానం బ్రిస్బేన్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉందని ఎమిరేట్స్‌ ప్రతినిధి తెలిపారు. అధికారులు తనిఖీ చేశారని.. విమానం లోపలి భాగం, ఫ్రేమ్‌, నిర్మాణంపై ఎలాంటి ప్రభావం పడలేదని చెప్పారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడినట్లు ఎలాంటి సమాచారం లేదు. టేకాఫ్ సమయానికి కొద్దిసేపటిముందే ఈ ఘటన జరిగి ఉండవచ్చని, ఆ సమయంలో విమానంలో పెద్ద శబ్దం వినిపించిందని, దాదాపు 45 నిమిషాలపాటు అది కొనసాగిందని చెప్పారు. ప్రయాణికులు స్థానిక వార్తా సంస్థకు తెలిపారు. అయితే, క్యాబిన్ సిబ్బంది రెక్కలు, ఇంజిన్‌లను తనిఖీ చేశారన్నారు.