Viral News: ఆ యువతి నవ్వినా, ఏడ్చినా ప్రాణాపాయమే.. 500 సార్లు చికిత్స.. ఈ వింత వ్యాధి ఏమిటో తెలుసా..

27 ఏళ్ల నటాషా కోట్స్ ఒక వ్యాధితో పోరాడుతోంది, దాని కారణంగా ఆమె స్వేచ్ఛగా నవ్వలేరు, ఏడవలేరు. దీని పేరు మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్. ఈ సిండ్రోమ్ ఏమిటో తెలుసుకోండి.

Viral News: ఆ యువతి నవ్వినా, ఏడ్చినా ప్రాణాపాయమే.. 500 సార్లు చికిత్స.. ఈ వింత వ్యాధి ఏమిటో తెలుసా..
Mast Cell Activation Syndro
Surya Kala

|

Jul 05, 2022 | 1:38 PM

Viral News: ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు.. ఒకొక్కసారి ఎవరి అనారోగ్యం గురించి విన్నా.. మనం ఎటువంటి వ్యాధి లేకుండా ఆరోగ్యంగా ఉన్నాం కదా.. అంతకంటే.. సంపదలేదు అనిపించకమానదు.. ఎవరికైనా.. ఏడ్చినా, నవ్వినా కన్నీరే వస్తాయి.. అయితే ఏడ్పు, నవ్వు కూడా సైన్స్ దృక్కోణంలో చూస్తే అనేక  ప్రయోజనాలను కలిగి ఉంటాయి.. అయితే ఓ యువతి అరుదైన వ్యాధితో బాధపడుతుంది. దీంతో ఆ అమ్మాయి.. ఏడవలేదు.. నవ్వలేదు.. ఎందుకంటే.. నవ్వినా ఏడ్చినా వెంటనే ఆస్పత్రికి చేరాల్సిందే..  ఇంగ్లండ్‌ కు చెందిన ఓ యువతి అరుదైన వ్యాధితో బాధపడుతోంది.  నాటింగ్‌హామ్‌ కి చెందిన 27 ఏళ్ల నటాషా కోట్స్ ఓ వింత వ్యాధితో పోరాడుతోంది. వ్యాధి పేరు మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్. ఎప్పుడైతే నటాషా ఎక్కువ ఉద్వేగానికి లోనైనప్పుడు, నవ్వినా లేదా కన్నీళ్లు వచ్చినప్పుడు, శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. నొప్పి మరింత తీవ్రమవుతుంది.. ఒకొక్కసారి మరణం అంచుకు చేరుకుంటుంది నటాషా.. వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిందే.

మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? నటాషా వ్యాధి గురించి ఏమి చెబుతుంది? నిపుణుల అభిప్రాయాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి

మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్ అంటే ఏమిటంటే:  అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆస్తమా, అలర్జీ అండ్ ఇమ్యునాలజీ నివేదిక ప్రకారం , మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్ అనేది ఇమ్యునోలాజికల్ డిజార్డర్. దీని కారణంగా రోగిలో అలర్జీ తీవ్ర స్థాయిలో ఉంటుంది. దీని లక్షణాలు శరీరం అంతటా కనిపిస్తాయి. సాధారణ భాషలో చెప్పాలంటే.. రోగులలో ఉండే మాస్ట్ కణాలు కొన్ని రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఈ రసాయనాలు అలెర్జీని కలిగించమే కాదు.. కడుపు, గుండె, శ్వాస , మెదడుపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధిగల వ్యక్తి భావోద్వేగంలో మార్పు అధికంగా ఉంటే..  ఈ లక్షణాలు మరింత తీవ్రంగా మారతాయి.

500 సార్లు ఆసుపత్రి పాలైన జిమ్నాస్ట్ నటాషా నటాషా వృత్తిరీత్యా జిమ్నాస్ట్. NY పోస్ట్ నివేదిక ప్రకారం.. నటాషాని చెమట, నవ్వు కూడా చంపగలవు. ఈ కారణంగా ఆమె దాదాపు 500 సార్లు ఆసుపత్రిలో చేరింది. 27 ఏళ్ల నటాషా మాట్లాడుతూ.. తాను ఎటువంటి భావోద్వేగాలైనా అలర్జీ వస్తుంది.  నవ్వినప్పుడు, ఏడ్చినప్పుడు, విచారంగా లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఇలా ప్రతిచర్య శరీరానికి అలర్జీని కలిగిస్తుంది.  అలెర్జీ కారణంగా  శరీరంపై దద్దుర్లు కనిపించడం ప్రారంభిస్తాయి.

తనను తాను బతికించుకోవడం కూడా తనకు పెద్ద పని అని చెప్పింది. 20 సంవత్సరాల వయస్సులో అనారోగ్యం కారణంగా చాలా కలత చెందింది. అంతేకాదు.. అప్పుడే నటాషా తన అంత్యక్రియలకు కూడా ప్లాన్ చేసుకుంది. నవ్వు,  ఒత్తిడితో మాత్రమే కాదు, పెర్ఫ్యూమ్‌లు, క్లీనింగ్ కాస్మెటిక్ ఉత్పత్తులు కూడా నటాషాకు అలెర్జీని కలిగిస్తాయి.

నిపుణుల అభిప్రాయం ఏమిటంటే? ఇది అరుదైన వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. పూర్తిగా నయం కాదు. రోగి పరిస్థితి క్షీణించినప్పుడు, వివిధ రకాల మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. ఉదాహరణకు, కడుపు, శరీరంలోని ఇతర భాగాలలో నొప్పికి సంబంధించిన మందులు, ఇవ్వాల్సి ఉంటుంది.

నటాషా మాట్లాడుతూ.. ప్రతిరోజూ నన్ను నేను రక్షించుకోవడానికి యుద్ధం చేస్తున్నాను. నేను నా భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటున్నాను. నేను బహిరంగంగా నవ్వలేను లేదా బహిరంగంగా ఏడవలేనని చెప్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu