SpiceJet Flight: అత్యవసరంగా పాకిస్తాన్‌లో దిగిన ఇండియన్ విమానం.. ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తుండగా.. కారణం ఇదే..
ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం పాకిస్తాన్ లోని కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఆకాశంలో 3600 అడుగుల ఎత్తులో విమానం ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని కరాచీలో ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా క్షేమంగా..
ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం పాకిస్థాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్. ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం పాకిస్తాన్ లోని కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఆకాశంలో 3600 అడుగుల ఎత్తులో విమానం ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని కరాచీలో ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని స్పైస్‌జెట్ యాజమాన్యం ప్రకటించింది. స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపం రావడం గత 20 రోజుల్లో ఇది మూడోసారి . రెండు రోజుల క్రితం ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌కు వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం రావడంతో తిరిగి ఢిల్లీకి వెనక్కి రప్పించారు. ఈ నేపథ్యంలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. అదే సమయంలో ఇప్పుడు ఢిల్లీ నుంచి మరో విమానం పంపబడుతుంది. అది ప్రయాణికులతో దుబాయ్‌కు బయలుదేరుతారు.
No emergency was declared & aircraft made a normal landing. There was no earlier report of any malfunction with the aircraft. Passengers have been served refreshments. A replacement aircraft is being sent to Karachi that will take the passengers to Dubai: SpiceJet Spokesperson
— ANI (@ANI) July 5, 2022
విమానం సాధారణ ల్యాండింగ్‌ను కలిగి ఉంది: స్పైస్‌జెట్ ప్రతినిధి
ఎలాంటి ఎమర్జెన్సీని ప్రకటించలేదని విమానం సాధారణ ల్యాండింగ్ అయిందని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. విమానంలో ఎటువంటి లోపం ఉన్నట్లు ఇంతకు తెలియలేదన్నారు. ప్రయాణికులకు ఫలహారాలు అందించారు. అదే సమయంలో ప్రయాణికులను దుబాయ్‌కు తీసుకెళ్లే విమానం కరాచీకి పంపబడుతుంది.