తెలుగు రాష్ట్రాల ఫేమస్.. చికెన్, మటన్‎ను మైమరిపించే వంకాయ పచ్చడి 

Prasanna Yadla

21 February 2026

Pic credit - Pixabay

అన్ని కూరగాయల్లో వంకాయ ఇచ్చే టేస్ట్ వేరు. ఎందుకంటే, ఇది తినడానికి అంత రుచిగా ఉంటుంది 

వంకాయ

ఈ వంకాయతో పచ్చడి చేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మరి, దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం.

వంకాయ

వంకాయలు, ఉప్పు, నూనె, చింతపండు రసం, ఆవపిండి, పసుపు,  కారం  తీసుకోవాలి. 

కావాల్సిన పదార్ధాలు

ముందుగా వంకాయలను తీసుకుని కడిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

స్టెప్ - 1

ఇప్పుడు ఈ వంకాయ ముక్కలలో మీరు రోజూ తినేంత ఉప్పు, చింతపండు రసం బాగా కలిపి రెండు రోజులు ఊరనివ్వాలి. 

స్టెప్ - 2

ఊరిన ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో అర టీ స్పూన్ ఆవపిండి, రెండు టీ స్పూన్స్  కారం, వెల్లుల్లి వేసి తాలింపు పెట్టుకోవాలి. 

స్టెప్ - 3

ఇలా తాలింపు పచ్చడిని ఒక సీసాలో నిల్వ చేసి మీకు తినాలనిపించిన సమయంలో దీనిని తినొచ్చు.

స్టెప్ - 4

వేడి వేడి అన్నంలో వంకాయ పచ్చడి, నెయ్యి వేసుకుని తింటే చికెన్, మటన్ కూడా సరిపోవు. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి 

వేడి వేడి అన్నంలో వంకాయ పచ్చడి