World Chocolate Day 2022: చాక్లెట్లు తింటే ఈ సమస్యలన్నీ హాంఫట్‌.. బరువు కూడా తగ్గొచ్చు తెలుసా?

World Chocolate Day 2022 :చాక్లెట్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఇవి నాలుకకు రుచిని అందించడమే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. దీనిలో ఉండే కోకో ఫినోలిక్ సమ్మేళనాలు

World Chocolate Day 2022: చాక్లెట్లు తింటే ఈ సమస్యలన్నీ హాంఫట్‌.. బరువు కూడా తగ్గొచ్చు తెలుసా?
World Chocolate Day 2022
Basha Shek

|

Jul 07, 2022 | 12:42 PM

World Chocolate Day 2022 :చాక్లెట్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఇవి నాలుకకు రుచిని అందించడమే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. దీనిలో ఉండే కోకో ఫినోలిక్ సమ్మేళనాలు మెదడును చురుగ్గా ఉంచుతాయి. వీటిని తినడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గిపోతాయని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి కూడా. ఈక్రమంలోనే చాక్లెట్ పట్ల ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రతి సంవత్సరం జూలై 7 న ‘వరల్డ్ చాక్లెట్ డే’ని జరుపుకుంటారు. ఘనా, యునైటెడ్ స్టేట్స్ వంటి ఇతర దేశాలు ఈ తేదీన చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకోవు. ఎందుకంటే అవి సొంత తేదీలను నిర్ణయించుకున్నాయి. ఘనా ఫిబ్రవరి 14 న జరుపుకుంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్టోబర్ 28 న చాక్లెట్ డేను జరుపుకుంటుంది. ఈ ప్రత్యేక రోజును జరుపుకోవడానికి కారణం తెలియకపోయినా 16 వ శతాబ్దంలో మొదటిసారిగా చాక్లెట్‌ను యూరప్‌కు తీసుకువచ్చినట్లు చెబుతారు. దీనిని కనుగొనడానికి యూరోపియన్లకు చాలా సమయం పట్టిందని చెబుతారు. 7 జూలై 1550 మొదటిసారి ఖండానికి చాక్లెట్ తెచ్చిన రోజుగా పరిగణిస్తారు. చాక్లెట్‌లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇక చాక్లెట్‌ డే రోజున చాలామంది తమ ప్రియమైనవారికి ,స్నేహితులకు చాక్లెట్లను బహుమతులుగా ఇస్తారు. మరి వరల్డ్‌ చాక్లెట్‌ డేని పురస్కరించుకుని వీటి వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి.

ఒత్తిడిని తగ్గిస్తుంది

కోకోలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. దీన్ని తినడం వల్ల ఒత్తిడిని పెంచే హార్మోన్లు అదుపులో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతారు. దీనివల్ల మానసిక స్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడి కూడా దూరమవుతుంది.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

చాక్లెట్ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనోల్స్ రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.

బరువు తగ్గడానికి..

చాక్లెట్ తినడం వల్ల బరువు తగ్గుతారని పలు అధ్యయనాలు, పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాక్లెట్ తినేవారి బాడీ మాస్ ఇండెక్స్ చాక్లెట్ తినని వారి కంటే తక్కువగా ఉందని ఇటీవల కొన్ని పరిశోధనల్లో తేలింది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి

చాక్లెట్ గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రిస్తాయి. తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ముడతలను తొలగించడంలో..

మీరు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలనుకుంటే చాక్లెట్‌ని క్రమం తప్పకుండా తినండి. దీన్ని తినడం వల్ల చర్మం బిగుతుగా మారి ముడతల సమస్యలు తగ్గుతాయి. ముఖం కూడా తాజాగా కనిపిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu