Nairobi Flies: సిక్కింలో నైరోబి ఫ్లై వ్యాప్తి, 100 మంది స్టూడెంట్స్ కు సోకినట్లు నిర్ధారణ.. ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ

సిక్కింలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఇన్ఫెక్షన్ కేసు తెరపైకి రావడంతో కలకలం రేగింది. ఈ నైరోబి ఫ్లై వైరస్ కేసులు ఎక్కువగా తూర్పు ఆఫ్రికాలో కనిపిస్తాయి. ఇవి చర్మంపై ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. 

Nairobi Flies: సిక్కింలో నైరోబి ఫ్లై వ్యాప్తి, 100 మంది స్టూడెంట్స్ కు సోకినట్లు నిర్ధారణ.. ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ
Nairobi Flies
Follow us
Surya Kala

|

Updated on: Jul 07, 2022 | 10:25 AM

Nairobi Flies: మనవాళిపై వైరస్ లు, క్రిమికీటకాదులు పగబట్టినట్లు ఉన్నాయి. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన ఏడాది నుంచి వరసగా.. రకరకాల వైరస్ లు మానవాళిని భయబ్రాంతులకు గురిచేస్తూనే ఉన్నాయి. కేరళలో టొమాటో ఫ్లూ ,ఆంత్రాక్స్ తర్వాత..  ఇప్పుడు సిక్కింలో నైరోబి ఫ్లై వ్యాప్తి పెరుగుతోంది. ఇప్పటివరకు ఇక్కడ 100 మంది విద్యార్థుల్లో నైరోబి ఫ్లై ఇన్ఫెక్షన్ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్య సిబ్బంది పేర్కొన్నారు. సిక్కింలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఇన్ఫెక్షన్ కేసు తెరపైకి రావడంతో కలకలం రేగింది. స్థానిక ఆరోగ్య అధికారులు మాట్లాడుతూ.. ఈ నైరోబి ఫ్లై వైరస్ కేసులు ఎక్కువగా తూర్పు ఆఫ్రికాలో కనిపిస్తాయి. ఇవి చర్మంపై ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి.  చర్మంపై దద్దుర్లు రావడంతోపాటు ఆ తర్వాత అది అంటువ్యాధిలా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన ఓ విద్యార్థి చేతికి ఆపరేషన్‌ చేయాల్సి వచ్చిందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

నైరోబీ ఫ్లై అంటే ఏమిటో, అది ఇన్ఫెక్షన్‌ను ఎలా వ్యాపిస్తుంది, ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి…

నైరోబీ ఫ్లై అంటే ఏమిటి? వీటిని కెన్యాన్ ఫ్లై లేదా డ్రాగన్ ఫ్లై అని కూడా అంటారు. ఇది రొయ్యల ఆకారంలో ఉంటుంది. వాటిలో రెండు ప్రధాన జాతులు ఉన్నాయి.  నారింజ, నలుపు. ఎరుపు  రంగుల్లో ఉంటాయి. ఈ ఫ్లైస్ సాధారణంగా ఎక్కువ వర్షాలు ఉన్న ప్రాంతంలో సంచరిస్తాయి. ఉత్తరాదిలో హిమాలయాల దిగువన వర్షపాతం అధికంగా ఉండడంతో అవి అక్కడ తిరుగుతున్నాయి. ఆహారం కోసం ఈగలు కొత్త ప్రదేశాలకు చేరుకుని ఇన్ఫెక్షన్‌ను వ్యాపిస్తాయి. గత కొన్ని వారాలుగా ఇవి సిక్కింలో కనిపిస్తున్నాయి. ఇతర కీటకాలు, చిమ్మటల వలె, ఇవి కూడా కాంతి వైపు ఆకర్షితులవుతాయి.

ఇవి కూడా చదవండి

మనుషులకు ఎలా సోకుతుందంటే? సాధారణంగా ఈ ఫ్లై మానవులను కుట్టదు. అయితే చర్మంపై వాలిన తర్వాత ఒక ప్రత్యేక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఈ రసాయనం పేరు పెడెరిన్. చర్మంపై ఈ రసాయనం పడిన వెంటనే మంట పెడుతున్న అనుభూతి వస్తుంది. ఒకొక్కసారి ఈ పరిస్థితి తీవ్రంగా కూడా ఉండవచ్చు.

చర్మం ఎర్రగా మారుతుంది. దురద, దద్దుర్లు వస్తాయి. ఈ లక్షణాలు సాధారణంగా ఈగ చర్మంపై వాలిన  24 గంటల తర్వాత కనిపించడం ప్రారంభిస్తాయి. అదే సమయంలో 48 గంటల తర్వాత, చర్మంపై బొబ్బలు, దద్దుర్లు కనిపించడం ప్రారంభిస్తాయి.

ఎప్పుడు సీరియస్ అవుతుందంటే?  రోగి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది.. ఈగ చర్మంపై ఎంత పాడ్రిన్ విడుదల చేసింది.. ఎంతసేపు కూర్చొని ఉంది అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఈగ ఎక్కువ విషాన్ని (రసాయన) వ్యాపించి, అది శరీరం అంతటా వ్యాపించి ఉంటే, అప్పుడు జ్వరం, నరాల నొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత కళ్లను రుద్దితే విష రసాయనం కళ్లలోకి చేరి కండ్లకలకకు కారణమవుతుంది. వైద్య భాషలో దీనిని నైరోబీ ఐ అంటారు. అటువంటి పరిస్థితిలో.. రోగికి తాత్కాలికంగా కళ్ళు చూపు మందగించవచ్చు.

ఎలా రక్షించుకోవాలి? దీని బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉదాహరణకు, దోమతెరలో నిద్రించండి. ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించండి..  రాత్రిపూట ఆరుబయట ప్రదేశాలలో నిదురించకుండా ఉండడం.. వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ ఫ్లై మీ చర్మం పై వాలితే.. బ్రష్ సహాయంతో దాన్ని తీసివేయండి. ఆ బ్రష్ ను ఎప్పుడూ మళ్ళీ వినియోగించవద్దు.

నైరోబి ఫ్లై అత్యధిక ఇన్ఫెక్షన్ కేసులు 1998లో కెన్యా , తూర్పు ఆఫ్రికాలో నమోదయ్యాయి.  ఆ ఏడాది అధిక వర్షాల కారణంగా దీని కేసులు తెరపైకి వచ్చాయి. ఆఫ్రికాతో పాటు, భారతదేశం, జపాన్, ఇజ్రాయెల్ లో కూడా ఈ కేసులు కనిపించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!