AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashadam Special: ఆషాడంలో మునగాకు కూర తినాలి అంటారు.. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా..

ఆషాడ లో మునగాకు తినాలి అంటారు. ఇలా ఆషాడంలో మునగాకు తినే సంప్రదాయం... ఇప్పటి కాదు.. అయితే అసలు ఆషాడ మాసంలో మునగాకు ఎందుకు తినాలి.. మిగిలిన నెలల్లో తినకూడదా అనే ప్రశ్నించే ఆధునిక భావాలున్నవారు కూడా ఉన్నారు..

Ashadam Special: ఆషాడంలో మునగాకు కూర తినాలి అంటారు.. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా..
Ashasam Munagaku
Surya Kala
|

Updated on: Jul 05, 2022 | 11:48 AM

Share

Ashadam Special: ఆషాఢమాసంలో పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరగవు కానీ.. ఈ ఆషాఢమాసం వస్తూనే ఎంతో సందడిని, సరదాను తీసుకొని స్తుంది. గ్రామాల్లోని గ్రామ దేవతలకు జాతర, మబ్బులు, చిరుజళ్ళతో ఆహ్లదకరమైన వాతావరణం, పుట్టింటి చేరే నవ వధువు, చేతుల్లో ఎర్రమందారంలా పూచే గోరింటాకు.. వీటితో పాటు.. మునగాకు కూర.. నేరేడు పండ్లు తాటికాయలు ఇవన్నీ ఆషాడానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అయితే ఆషాడ లో మునగాకు తినాలి అంటారు. ఇది నేటి తరం ఎప్పుడైనా విన్నారా.. అయితే మునగాకు తినే సంప్రదాయం… ఇప్పటి కాదు.. అయితే అసలు ఆషాడ మాసంలో మునగాకు ఎందుకు తినాలి.. మిగిలిన నెలల్లో తినకూడదా అనే ఆధునిక భావాలున్నవారు కూడా ఉన్నారు.. అయితే ఇలా ఆషాడంలో మునగాకు తినాలి అని పెద్దలు పెట్టిన సాంప్రదాయం వెనుక ఒక శాస్త్రీయ కోణం దాగి ఉంది. ఈరోజు చాదస్తం వెనుక ఉన్న ఆరోగ్యప్రయోజనాలు గురించి తెల్సుకుందాం..

మునగాకు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఈ మునగాకు వేడి చేసే గుణం కలిగి ఉంటుంది. అందుకని వేసవిలో ఈ మునగాకు తినడం వలన విపరీతమైన వేడి చేసి.. ఇతర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కనుక మునగాకు తినడానికి అనుకూల సమయం.. వర్షాలు కురిసే ఆషాడం. ఆషాడంలో లేత మునగాకు దొరుకుతుంది.. తిన్నా శరీరంలో వేడి పెరిగినా వర్షాకాలం కనుక పెద్దగా ఇబ్బందులు ఏర్పడవు.

మునగాకుతో బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడినీ పెంచుతుంది. మునగాకులోని పోషకాలు శరీరానికి అందుతాయి. మునగాకు తినడం వలన దీనిలో అధికంగా ఉన్న విటమిన్ ఏ..  కంటి సమస్యలను నివారిస్తాయని.. ప్రకృతి వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మునగాకు తినడం వలన ప్రొటీన్లు, విటమిన్‌ ఎ, సి, కాల్షియం, ఐరన్‌, పొటాషియం మనకి లభిస్తాయి.  మునగాకుని ఏ రూపంలో తిన్నా మధుమేహం నియంత్రణలో ఉంచుతుంది. అస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులను కూడా నివారిస్తుంది.  అంతేకాదు మునగాకు బాలింతలకు, గర్భిణులకు ఎంతో మంచిది.

అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఈ మునగాకుని డైరెక్ట్ గా తినలేము.. ఎందుకంటే కొంచెం  చేదు రుచి కలిగి ఉంటుంది. కనుక మునగాకు పెసర పప్పు, అనపప్పు పప్పులో వేసుకుని వండుకుంటారు. లేదంటే. తెలగపిండి మునగాకు కూరగా చేసుకుని తింటారు..

గోదావరి జిలాల్లో ఆషాడం ఆదివారం వస్తే.. ప్రతి ఇంట్లో.. మునగాకు పప్పు, లేదా తెలగపిండి మునగాకు కూర చేసుకుంటారు. ఇక గోరింటాకు రుబ్బి.. తమ ఇరుగు పొరుగుకు పంచిపెడతారు.. ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటించే కుటుంబాలు అనేకం ఉన్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చింది. నిజనిర్ధారణ కోసం మీ శరీరానికి సంబంధించిన వైద్య సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది)

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో