Lungs Infection: ఈ లక్షణాలు కనిపిస్తే.. ఊపిరితిత్తులు డేంజర్‌లో పడుతున్నట్లు లెక్క..

ఈ లక్షణాలు కనిపిస్తే.. ఊపిరితిత్తులు డేంజర్ లో పడుతున్నట్లు లెక్క అని నిపుణులు చెబుతున్నారు. ఈరోజు ఊపిరితిత్తుల‌కు ఇన్ఫెక్షన్ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం..

Lungs Infection: ఈ లక్షణాలు కనిపిస్తే.. ఊపిరితిత్తులు డేంజర్‌లో పడుతున్నట్లు లెక్క..
Lungs Infection
Follow us
Surya Kala

|

Updated on: Jun 30, 2022 | 11:59 AM

Lungs Infection: ఊపిరితిత్తులు అనేవి మన శ‌రీరంలోని శ్వాసవ్యవస్థలోని ముఖ్యమైన అవ‌యవాలు.  ప్రక్కటెముకలు వీటిని రక్షిస్తూ ఉంటాయి. ఇవి మ‌నం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజ‌న్‌ను గ్రహించి  రక్త ప్రవాహంలోనికి పంపించడం. త‌రువాత అవ‌య‌వాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే కార్బన్ డ‌యాక్సైడ్ ను గ్రహించి ఊపిరి ద్వారా బయటకు పంపించడం వీటి ముఖ్యమైన పని. దీంతో శ్వాసక్రియ పూర్తవుతుంది. మానవులు మాట్లాడటానికి అవసరమైన గాలిని ఉత్పత్తి చేసేవి కూడా ఊపిరితిత్తులే. మన శ‌రీరానికి గాలి స‌రిగ్గా అందుతుంది.  మనుషుల్లో రెండు (ఎడమ, కుడి) ఊపిరితిత్తులు ఉంటాయి. కుడి ఊపిరితిత్తి ఎడమ దానికన్నా పెద్దదిగా ఉంటుంది.  ఊపిరితిత్తుల్లోని కణజాలం వివిధ రకాలైన శ్వాసకోశ సంబంధిత వ్యాధుల వలన దెబ్బతినే అవకాశం ఉంది. వీటిలో న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధానమైనవి. అంతేకాదు కరోనా వెలుగులోకి వచ్చిన అనంతరం.. తరచుగా వింటున్న మాట.. ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫక్షన్. ఊపిరితిత్తులకు ఇన్‌ఫక్షన్ వ‌చ్చిన‌ప్పుడు అవి స‌రిగ్గా ప‌నిచేవు.. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే.. ఊపిరితిత్తులు డేంజర్ లో పడుతున్నట్లు లెక్క అని నిఫుణులు చెబుతున్నారు. ఈరోజు ఊపిరితిత్తుల‌కు ఇన్ఫెక్షన్ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం..

*ఊపిరితిత్తుల‌కు ఇన్ఫెక్షన్లు రకరకాల కారణాల వలన వస్తాయి. ముఖ్యంగా దగ్గు ఎక్కువగా వస్తుంటే.. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అనుమానించాలి.. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు, చికిత్స తీసుకోవాలి.

*ముఖ్యంగా ఛాతిలో నొప్పిగా ఉంటే.. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వచ్చినట్లు అనుమానించాలి. ఒకొక్కసారి రెండు ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చినట్లు అనుమానించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

*తరచుగా జ్వరం వస్తుంటే.. లంగ్ ఇన్‌ఫెక్షన్ ఉండే అవ‌కాశం ఉంది. ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, తో పాటు, ముక్కు, నోటి నుంచి నీరు కారుతుంటే..  ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.. వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

*శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంటే.. ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్షన్ ఏమో అనుమానించాల్సి ఉంటుంది.

*తీవ్రంగా అలసటకు గురవుతున్నా.. చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నా ఊపిరితిత్తులు పనితీరుపై అనుమానించాల్సి ఉంటుందని.. డాక్టర్ ని సంప్రదించడం మంచిది అని అంటున్నారు.

*గురక తీవ్ర స్థాయిలో వస్తుంటే.. లంగ్స్ పనితీరుపై అనుమానించాల్సి ఉంటుందట..

*దీర్ఘకాలిక కఫంతో ఇబ్బంది పడుతుంటే.. ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం కఫంతో ఇబ్బంది పడుతుంటే.. ఊపిరితిత్తుల పనితీరుపై ఆలోచించాల్సిందేనట..

*వీటిల్లో ఏ లక్షణాలు కనిపించినా.. నిర్లక్ష్యం చేయకుండా.. వెంటనే వైద్యుడిని సంప్రదించి.. తగిన చికిత్స తీసుకోవాలి. తద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చింది. నిజనిర్ధారణ కోసం మీ శరీరానికి సంబంధించిన వైద్య సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది)