AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Doctors Family: ఆ ఫ్యామిలీలో వంద ఏళ్లుగా ప్రతి సభ్యుడు వైద్యుడే.. ఇప్పటికి 150 మంది డాక్టర్లు ఉన్న కుటుంబం

గత వంద సంవత్సరాలుగా.. అంటే 1920 నుండి ప్రతి కుటుంబ సభ్యుడు డాక్టర్‌. ఢిల్లీలోని సబర్వాల్ కుటుంబంలో ఇప్పుడు 150 మందికి పైగా వైద్యులు ఉన్నారు.

Doctors Family: ఆ ఫ్యామిలీలో వంద ఏళ్లుగా ప్రతి సభ్యుడు వైద్యుడే.. ఇప్పటికి 150 మంది డాక్టర్లు ఉన్న కుటుంబం
Delhis Doctor Family
Surya Kala
|

Updated on: Jun 30, 2022 | 12:27 PM

Share

150 Doctors Family: వైద్యో నారాయణో హరిః అన్నారు పెద్దలు.. అంటే.. డాక్టర్ దేవుడితో సమానం అని అర్ధం.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. తన స్వార్ధం చూసుకోకుండా.. వృత్తికి అంకితమై.. పనిచేస్తారు వైద్యులు. ప్రతి ఏడాది  జూలై 1ని వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు. కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత..  వైద్యులు,  ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిమరీ.. కోవిడ్ బాధితులకు రాత్రనక, పగలనక పనిచేశారు. డాక్టర్ వృత్తికి కృషి, అంకితభావం ఎంత అవసరమో కరోనా వైరస్ ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసింది. తమ ఇంట్లో ఒక్క డాక్టర్ ఉంటేనే గొప్పగా ఫీల్ అవుతారు.. అలాంటిది ఒక ఫ్యామిలీలో వంద ఏళ్లుగా ప్రతి వ్యక్తి డాక్టర్.. రేపు వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆ విశిష్ట కుటుంబం గురించి తెలుసుకుందాం..

గత వంద సంవత్సరాలుగా.. అంటే 1920 నుండి ప్రతి కుటుంబ సభ్యుడు డాక్టర్‌. ఢిల్లీలోని సబర్వాల్ కుటుంబంలో ఇప్పుడు 150 మందికి పైగా వైద్యులు ఉన్నారు. వారు ఈ వృత్తిని ఒక మిషన్‌గా చూస్తారు కానీ అదే సమయంలో వైద్య వృత్తిని సవాలుగా కూడా స్వీకరిస్తారు.

కుటుంబానికి చెందిన కోడలు డాక్టర్ గ్లోస్సీ సబ్బర్వాల్ ఒక చిత్రం వైపు చూపిస్తూ.. ఈ చిత్రం 1920 నాటిదని.. ఆ కుటుంబానికి చెందిన దివంగత పితామహుడు లాలా జీవన్‌మాల్ ఈ ఆసుపత్రిని పాకిస్తాన్‌లోని జలాల్‌పూర్ నగరంలో ప్రారంభించినప్పటి నుండి అని చెప్పారు. విద్య, వైద్య సేవల నాణ్యతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గాంధీజీ నుంచి తమ ఫ్యామిలీ స్ఫూర్తిని పొందిందని తెలిపారు. అప్పుడే లాలా జీవన్‌మాల్ తన నలుగురి పిల్లల్ని  వైద్యులను చేయాలని నిర్ణయించుకున్నారు. స్వాతంత్ర్యం తరువాత.. లాలా జీవన్‌మాల్ కుటుంబం ఢిల్లీకి మారింది. అయినప్పటి ఆ సంప్రదాయం కొనసాగింది.

ఇవి కూడా చదవండి
Doctor Family 1

Doctor Family 1

ఫ్యామిలీలో అందరినీ డాక్టర్‌గా మార్చే వారసత్వం అప్పుడే మొదలైంది. “ఇది గత 102 సంవత్సరాలుగా కొనసాగుతోంది. అయితే ఇలా కుటుంబంలో ప్రతి ఒక్కరూ డాక్టర్ చదవడం అంటే.. అంత తేలికైన పని కాదు. ఎందుకంటే కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా వ్యక్తుల ఆలోచనలు, అభిరుచుల్లో కూడా మార్పులు వస్తాయి. అదే విధంగా లాలా జీవన్‌మాల్  కుటుంబంలోని ఒక కొడుకు మేనేజ్‌మెంట్ డిగ్రీ చదవడం ప్రారంభించారు. అయితే అమ్మమ్మ తన మనవడు డాక్టర్ కాకుండా వేరే చదువు చదవడం పై భావోద్వేగానికి గురయ్యారు. పైగా ఆ ఫ్యామిలీలో డాక్టర్ వృత్తి అనే వాతావరణంతో  నిండిపోయింది.  దీంతో అతను తన మేనేజ్‌మెంట్ చదువుకు గుడ్ బై చెప్పి.. మళ్ళీ వైద్య వృత్తిని అభ్యసించాల్సి వచ్చింది. ఇప్పుడు అతను సక్సెస్ ఫుల్ సర్జన్” అని అంకుష్ సబ్బర్వాల్ చెప్పారు.

ఢిల్లీలోని జీవన్‌మాల్ హాస్పిటల్‌లో ఇప్పటి వరకూ ఏ రోగి డబ్బులు లేవనే కారణంతో వైద్యం తీసుకోకుండా తిరిగి వెళ్ళలేదు. ఆ ఆస్పత్రిలో పేదవారికి కూడా సరైన చికిత్స అందించే వ్యవస్థ ఉంది. అయితే కరోనా సృష్టించిన కల్లోలంలో ఈ ఫ్యామిలీ కూడా తమ కుటుంబ సభ్యులను పోగొట్టుకుంది. లాలా జీవన్‌మాల్   కుటుంబంలోని ఇద్దరు సభ్యులు గతేడాది కరోనాతో మరణించారు. ఎంతో శ్రమ, త్యాగం అవసరమయ్యే డాక్టర్ వృత్తిని స్వీకరించమని.. వచ్చే తరాన్ని ఒప్పించడం చాలా కష్టమని డాక్టర్ వినయ్ చెప్పారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..