Monsoon Health Tips: వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే..!

Monsoon Health Tips: వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే..!

Anil kumar poka

|

Updated on: Jul 05, 2022 | 10:00 AM

వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు మనల్ని ఇబ్బంది పెడతాయి. వాతావారణంలోని మార్పులకు తోడు కలుషితమైన నీటి కారణంగా పలు సమస్యలు వెంటాడుతుంటాయి. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల


వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు మనల్ని ఇబ్బంది పెడతాయి. వాతావారణంలోని మార్పులకు తోడు కలుషితమైన నీటి కారణంగా పలు సమస్యలు వెంటాడుతుంటాయి. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులకు తోడు ఎసిడిటీ, వికారం, బరువు పెరగడం తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక వర్షాకాలంలో చాలామంది డీప్‌ ఫ్రైడ్‌ ఆహార పదార్థాలను అధికంగా తీసుకుంటుంటారు. ఇవి కూడా అనారోగ్యానికి దారితీస్తాయి. ఈక్రమంలో వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల బారి నుంచి రక్షణ పొందాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు. వర్షాకాలంలో కొన్ని ఆహారపదార్ధాలకు దూరంగా ఉంటే మంచిదంటున్నారు. అవేంటంటే…వర్షాకాలంలో పాలు, పెరుగును తక్కువ తీసుకోవడం మంచిందటున్నారు. ఈ సీజన్‌లో, పశువుల మేతపై పెరిగే కీటకాలు పాలు లేదా ఇతర వస్తువుల ద్వారా మనపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆయుర్వేదం నిపుణుల సూచన ప్రకారం వర్షాకాలంలో ఆకుకూరలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో ఆకులపై క్రిములు పెద్ద మొత్తంలో పేరుకుపోతాయని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో వాటిని సరిగా శుభ్రం చేసుకోకుండా తింటే అనారోగ్యానికి గురవుతారు. వర్షాకాలంలో బెండకాయలు, క్యాబేజీలు వీలైనంత తక్కువగా తీసుకోవాలట. ఎందుకంటే వర్షాకాలంలో వాటిలో క్రిములు పెరుగుతాయట.. అవి ఉదర సంబంధిత సమస్యలను తెచ్చిపెడతాయంటున్నారు. వర్షాకాలంలో నాన్‌వెజ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. వాతావరణంలోని తేమ, కలుషిత నీటి కారణంగా మాంసం త్వరగా చెడిపోతుంది. అందువల్ల వీటికి దూరంగా ఉంచడం మంచిదంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 05, 2022 09:59 AM