President Election: రాష్ట్రపతి ఎన్నికకు వేళాయే.. దేశంలో ఇప్పటివరకు 14 మంది రాష్ట్రపతులు.. ఏ పార్టీ ఎవరికి నాయకత్వం వహించిందంటే

భారత రాష్ట్రపతి గా ఇప్పటి వర్కకూ 14 మంది అధ్యక్షులు ఎన్నికయ్యారు. వీరిలో 6 మంది అధ్యక్షులు దక్షిణ భారతదేశానికి చెందిన వారు. ఉత్తర, తూర్పు , పశ్చిమ భారతదేశం నుండి 8 మంది రాష్ట్రపతులు ఉన్నారు. వీరిలో 6 మంది బ్రాహ్మణులు, 2 దళితులు, 1 కాయస్థ, 3 ముస్లింలతో పాటు 1 మహిళకూడా రాష్ట్రపతిగా ఎంపికయ్యారు.

President Election: రాష్ట్రపతి ఎన్నికకు వేళాయే.. దేశంలో ఇప్పటివరకు 14 మంది రాష్ట్రపతులు.. ఏ పార్టీ ఎవరికి నాయకత్వం వహించిందంటే
Indian Presidents
Follow us
Surya Kala

|

Updated on: Jul 07, 2022 | 11:06 AM

President Election: దేశంలో రాష్ట్రపతి పదవికి జూలై 18న ఓటింగ్ జరగనుంది. ఎన్‌డిఎ అభ్యర్థిగా గిరిజన మహిళా అభ్యర్థి ద్రౌపది ముర్మును బీజేపీ  ప్రకటించగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హాను తమ అభ్యర్థిగా పేర్కొంది. యశ్వంత్ సిన్హా  ఇప్పుడు  టీఎంసీలో ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రపతి ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే అధికార పార్టీ అభ్యర్థులే ఎక్కువ మంది గెలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావడం దాదాపు ఖాయం. ఇదే జరిగితే భారత చరిత్రలో దేశానికి తొలి గిరిజన మహిళ రాష్ట్రపతి అవుతారు. రాష్ట్రపతి పదవికి ఇప్పటివరకు దేశంలో 15 ఎన్నికలు జరగ్గా, 14 మంది ఈ పదవిని చేపట్టారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా ఉన్నారు. ఇప్పటి వరకూ రెండుసార్లు రాష్ట్రపతిగా చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అయితే వరాహగిరి వెంకట గిరి కూడా రెండుసార్లు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ..  మొత్తం పదవీకాలం రాష్ట్రపతిగా పనిచేయలేదు. 3 మే 1969 నుండి 20 జూలై 1969 వరకు స్వల్పకాలానికి అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం..  24 ఆగస్టు 1969 నుండి 24 ఆగస్టు 1974 వరకు కూడా తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నారు. వాస్తవానికి,  ఫకృద్దీన్ అలీ అహ్మద్ పదవిలో ఉన్న సమయంలోనే హఠాత్తుగా మరణించారు.

6 బ్రాహ్మణులు, 3 ముస్లింలు, 2 దళితులు రాష్ట్రపతి అయ్యారు దేశంలో ఇప్పటివరకు అధ్యక్షుల్లో 6 మంది బ్రాహ్మణులు, 3 ముస్లింలు, 2 దళితులు, ఒక కాయస్థ, ఒక సిక్కు, ఒకే మహిళ ఉన్నారు. స్వాతంత్య్రం  వచ్చినప్పటి నుంచి డా.రాజేంద్రప్రసాద్ మాత్రమే కాయస్థ నుంచి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈసారి రెండో కాయస్థ కులం నుంచి యశ్వంత్ సిన్హాను యూపీఏ నామినేట్ చేసింది. అయితే ఆయన విజయావకాశాలు తక్కువగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దేశంలోని ఏ ప్రాంతం నుండి ఎంత మంది అధ్యక్షులు? ఎన్నికైన 14 మంది అధ్యక్షులలో 6 మంది అధ్యక్షులు దక్షిణ భారతదేశానికి చెందిన వారు. వీరిలో సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకటరామన్, ఏపీజే అబ్దుల్ కలాం తమిళనాడుకు చెందిన వారు కాగా, డాక్టర్ జాకీర్ హుస్సేన్, నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు, కేఆర్ నారాయణన్ కేరళకు చెందినవారు. అదే సమయంలో, ఉత్తర, తూర్పు, పశ్చిమ భారతదేశం నుండి 8 మంది రాష్ట్రపతులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ బీహార్‌కు చెందినవారు. ఫకృద్దీన్ అలీ అహ్మద్ ఢిల్లీకి చెందినవారు. పంజాబ్‌కు చెందిన ఏకైక సిక్కు అధ్యక్షుడు గియానీ జైల్ సింగ్. వీరితో పాటు మధ్యప్రదేశ్‌ నుంచి శంకర్‌ దయాళ్‌ శర్మ, పశ్చిమ బెంగాల్‌ నుంచి ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన ఏకైక మహిళా అధ్యక్షురాలు ప్రతిభా దేవి సింగ్ పాటిల్. అదే సమయంలో, ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు.

కాంగ్రెస్, బీజేపీ, యునైటెడ్ ఫ్రంట్… ఏ పార్టీ ఎవరికి నాయకత్వం వహిస్తుంది? బీజేపీ అగ్రవర్ణాలకు చెందిన పార్టీ అని అంటారు…  అయితే 14 ఏళ్ల మూడు దఫాలుగా ఆ పార్టీ ముస్లిం, దళిత, గిరిజన మహిళలను అభ్యర్థులను  అధ్యక్ష పదవికి  నిలబెట్టింది. మరోవైపు, కాంగ్రెస్ తన 55 ఏళ్ల కాలంలో ఎక్కువగా అగ్రవర్ణాల అభ్యర్థులకే పరిమితమైంది. కాంగ్రెస్ హయాంలో బ్రాహ్మణులు, సిక్కులు, మహిళలు, కాయస్థులు రాష్ట్రపతి అయ్యారు కానీ ఒక్క ఆదివాసీ, దళితుడు కూడా రాష్ట్రపతి కాలేకపోయాడు. కాంగ్రెస్ ఇప్పటివరకు 6 బ్రాహ్మణులు, 2 ముస్లింలు, 1 కాయస్థ, 1 సిక్కు, ఒక రాజ్‌పుత్ మహిళను రాష్ట్రపతిగా నిలబెట్టింది.

దేశంలో అనేక సార్లు జనతాదళ్, జనతా పార్టీ , యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ 5 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయింది. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని కాంగ్రెసేతర ప్రభుత్వంలో, బ్రాహ్మణ అభ్యర్థి నీలం సంజీవ రెడ్డి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1997లో రెండోసారి కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చినా యునైటెడ్ ఫ్రంట్‌కు బయటి నుంచి కాంగ్రెస్ మద్దతు లభించింది. అప్పుడు దళిత సంఘం నుంచి వచ్చిన కేఆర్ నారాయణన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నారాయణన్ గతంలో కాంగ్రెస్ హయాంలో (1992) ఉపరాష్ట్రపతిగా చేశారు.

కేంద్రంలో 3 పర్యాయాలు అధికారంలో ఉన్నా బీజేపీ రాష్ట్రపతి పదవికి అగ్రవర్ణాల అభ్యర్థులను ముందుకు తీసుకురాలేదు. 2002లో, అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో..  NDA ముస్లిం శాస్త్రవేత్త డాక్టర్. APJ అబ్దుల్ కలాంను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసింది. మిస్సైల్ మ్యాన్ రాష్ట్రపతిగా అత్యంత ప్రజాధారణను సొంతం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..