చలికాలంలో బాదంపప్పు నానబెట్టి తినాలా? వద్దా?

23 December 2024

TV9 Telugu

TV9 Telugu

డ్రైఫ్రూట్స్‌లో బాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఇది రుచిగా ఉండటంతోపాటు తక్షణ శక్తిని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది

TV9 Telugu

ప్రతిరోజూ 6, 8 నుంచి పది వరకు బాదంపప్పులను తినొచ్చు. అయితే వయస్సు, ఆరోగ్యం, ఫిట్‌నెస్ లక్ష్యాలను బట్టి వీటిని ఎక్కువ లేదా తక్కువ తీసుకోవచ్చు

TV9 Telugu

ముఖ్యంగా చలికాలంలో బాదంపప్పు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే బాదం పప్పులు వేడి స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది

TV9 Telugu

అయితే వీటిని నానబెట్టి తినాలా లేదా నానబెట్టకుండా తినాలా అనే గందరగోళం చాలా మందికి ఉంటుంది. అయితే చలికాలంలో కూడా నానబెట్టిన బాదం తినాలా? అంటే.. నానబెట్టిన బాదం పప్పునే ఉదయాన్నే తినాలని డైటీషియన్లు సలహా ఇస్తున్నారు

TV9 Telugu

ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి దీని వెనుక కారణం.. నానబెట్టడం వల్ల దాని ఎంజైమ్‌లు చురుకుగా మారడమే

TV9 Telugu

బాదంలో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఇ, మాంగనీస్, మెగ్నీషియం, మోనోశాచురేటెడ్ ఫ్యాట్, కాపర్, బి2, ఫాస్పరస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి

TV9 Telugu

బాదంపప్పు తినడం వల్ల చర్మం మెరుస్తుంది. ఎందుకంటే ఇందులో మంచి మొత్తంలో విటమిన్ ఇ ఉంటుంది. దీని నూనె చర్మానికి కూడా మేలు చేస్తుంది

TV9 Telugu

బాదంపప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి, రక్తపోటు స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండెకు ఆరోగ్యకరమైనది. ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఇతోపాటు ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని పెంచుతాయి