కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త

కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త

Phani CH

|

Updated on: Dec 23, 2024 | 7:15 PM

కొత్త బట్టలనగానే చిన్నా పెద్దా తేడా లేకుండా ఎగిరి గంతేస్తారు. కొత్త బట్టలు కొన్న దగ్గరనుంచి ఎప్పుడెప్పుడు వేసుకుంటామా అని ఎదురుచూస్తుంటారు. ఏదో ఒక ప్రత్యేక మైన రోజు సందర్భంగా కొత్తబట్టలు నేరుగా వేసుకుంటూ ఉంటాం. కానీ అలా కొత్తబట్టలు అలా డైరెక్ట్‌గా వేసుకోకూడదు అంటున్నారు నిపుణులు.  అయితే ఎందుకు? కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటే ఏం జరుగుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు? ఓసారి తెలుసుకుందాం.. మనం ప్రత్యేక సందర్భాల్లో కొత్త బట్టలు కొంటూనే ఉంటాం.

పెద్దవాళ్లు వాటిని ఉతికిన తర్వాతే వేసుకోమని చెప్తారు. ఇందులో నిజం లేకపోలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. షాపులో కొన్న కొత్త బట్టలపై హానికర రసాయనాలు ఉంటాయట. వాటిని ఉతికి ఎండలో ఆరేస్తే అవి పోతాయని అంటున్నారు. అంతేకాకుండా వాటిని ఇస్త్రీ చేసుకుని ధరిస్తే మరింత మంచిదని చెబుతున్నారు. కానీ, అవేమీ పట్టించుకోకుండా అలాగే వేసుకుంటే చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??

క్యూట్ లుక్స్ కుర్రకారుని ఇట్టే పడేస్తున్న మాడ్ బ్యూటీ శ్రీ గౌరి..