AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని ఆమె చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది.. శ్రీ విష్ణు షాకింగ్ కామెంట్స్

యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీవిష్ణు మొన్నీమధ్య సామజవరాగమనా అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు శ్రీ విష్ణు.

బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని ఆమె చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది.. శ్రీ విష్ణు షాకింగ్ కామెంట్స్
Sree Vishnu
Rajeev Rayala
|

Updated on: Dec 24, 2024 | 8:25 AM

Share

టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీ విష్ణు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఆ తర్వాత హీరోగా మారి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. శ్రీ విష్ణు నటించే సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా.. ప్రేక్షకులకు మాత్రం మంచి ఆసక్తి ఉంటుంది. కథలు కూడా కొత్తగా అనిపిస్తుంటాయి. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ డేస్ లో వరుసగా హిట్స్ అందుకుంటున్నాడు ఈ టాలెంటడ్ హీరో.. సమజవరాగమనా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శ్రీ విష్ణు. ఆతర్వాత ఓం భీమ్ బుష్ , స్వాగ్ సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. కాగా మొన్నామధ్య శ్రీ విష్ణు ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి : మెంటల్ మాస్ మావ.! ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

ఓ నటి తమ సినిమా షూటింగ్ లో ఉండగానే చెప్పా పెట్టకుండా బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని వెళ్లిపోయిందట. ఈవిషయాన్ని శ్రీవిష్ణు తెలిపారు. శ్రీవిష్ణు నటించిన సినిమాల్లో ఓం భీమ్ భీష్  సినిమా ప్రేక్షకులను విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కామెడీ హారర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీ విష్ణుతో పాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కూడా నటించారు. అలాగే ఈ సినిమాలో అయేషా ఖాన్ సెకండ్ హీరోయిన్ గా నటించింది.

ఇది కూడా చదవండి :17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్ అయ్యింది.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్.. ఆ తప్పులే కారణం

ఓం భీమ్ భీష్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీవిష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అయేషా ఖాన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా ఆలస్యం అవ్వడానికి అయేషా ఖాన్ కూడా ఓ కారణం అని అన్నారు. సినిమా షూటింగ్ లో ఉండగా చెప్పాపెట్టకుండా బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని వెళ్లిపోయిందని తెలిపాడు శ్రీవిష్ణు. కనీసం ఆమె సెట్ లో ఎవరికీ చెప్పలేదని.. బిగ్ బాస్ కు వెళ్లి అక్కడ క్రేజ్ తెచ్చుకుందని తెలిపాడు శ్రీ విష్ణు. ఆ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన అయేషా ఖాన్ ఆతర్వాత హీరోయిన్ గా మారింది. హిందీతో పాటు తెలుగులోనూ సినిమాలు చేసింది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ మెప్పించింది. ఈ అమ్మడు హిందీ బిగ్ బాస్ సీజన్ 17లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఇది కూడా చదవండి :పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ భామ.. విడాకులు తీసుకున్న వ్యక్తితో వివాహం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us