- Telugu News Photo Gallery Cinema photos Do you remember the heroine who acted in NTR's Shakthi movie? Do you know how she is now?
మెంటల్ మాస్ మావ.! ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో ఈ బ్యూటీ నటించింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది.ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ వయ్యారి భామ . చాలా మంది హీరోయిన్ ఇలా కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకొని.. ఆతర్వాత సినిమాలకు దూరం అవుతుంటారు.
Updated on: Dec 21, 2024 | 8:56 PM

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు ఇలా వచ్చారు.. అలా మాయమైపోయారు. కానీ కొందరే చేసేవి తక్కువ సినిమాలే అయినప్పటికీ.. తమ మార్క్ వదిలి వెళ్తుంటారు. అలాంటి ముద్దుగుమ్మల్లో ఒకరు ఈ అందాల భామ ఒకరు.

ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో ఈ బ్యూటీ నటించింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది.ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ వయ్యారి భామ . ఇంతకూ తాను ఎవరంటే.

ఎన్టీఆర్ సరసన నటించిన ఈ బ్యూటీ మరెవరో కాదండీ.! మంజరీ ఫడ్నిస్. అల్లరి నరేష్‌తో ‘సిద్దూ ఫ్రం శ్రీకాకుళం’ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో హద్దులు లేని అందాల ఆరబోత ఒలకబోసి.. కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపింది.

ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు కె. విశ్వనాధ్ తెరకెక్కించిన ‘శుభప్రదం’ అనే మూవీలో మెరిసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ కాకపోయినా.. మంజరీ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అనంతరం యంగ్ టైగర్ సరసన ‘శక్తి’ సినిమాలో కనిపించింది.

హిందీ, మరాఠీ భాషల్లో పలు చిత్రాల్లో నటించడమే కాదు.. వెబ్ సిరీస్‌లలోనూ తళుక్కుమన్నది ఈ చిన్నది. కొన్ని హిట్ చిత్రాలను కూడా తన ఖాతాలో వేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన అందాలతో అదరగొడుతుంది.




