- Telugu News Photo Gallery Cinema photos NTR next movie with jailer director nelson Dilipkumar after war 2 and dragon, details here
NTR: ఆర్డినరీగా కనిపించే ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్ ఎన్టీఆర్.! నెక్స్ట్ ప్లాన్ అదుర్స్..
పైకి ఆర్డినరీగా కనిపిస్తుంటారు కానీ లోపల మాత్రం ఎన్టీఆర్ ఎక్స్‌ట్రార్డినరీ. ఆయన ప్లానింగ్ మామూలుగా ఉండదు. టాలీవుడ్‌లో మరే హీరోకు సాధ్యం కాని రేంజ్‌లో తారక్ ప్లానింగ్ ఉందిప్పుడు. అది గానీ వర్కవుట్ అయిందా.. దెబ్బకు ప్రభాస్ కంటే పైకెక్కి కూర్చుంటారు ఎన్టీఆర్. మరి ఆ రేంజ్‌లో తారక్ ఏం ప్లాన్ చేస్తున్నారు..? ఇంతకీ ఆయనేం చేస్తున్నారో చూద్దాం..
Updated on: Dec 21, 2024 | 6:42 PM

పైకి ఆర్డినరీగా కనిపిస్తుంటారు కానీ లోపల మాత్రం ఎన్టీఆర్ ఎక్స్‌ట్రార్డినరీ. ఆయన ప్లానింగ్ మామూలుగా ఉండదు. టాలీవుడ్‌లో మరే హీరోకు సాధ్యం కాని రేంజ్‌లో తారక్ ప్లానింగ్ ఉందిప్పుడు.

అది గానీ వర్కవుట్ అయిందా.. దెబ్బకు ప్రభాస్ కంటే పైకెక్కి కూర్చుంటారు ఎన్టీఆర్. మరి ఆ రేంజ్‌లో తారక్ ఏం ప్లాన్ చేస్తున్నారు..? ఇంతకీ ఆయనేం చేస్తున్నారో చూద్దాం..

దేవర విజయంతో ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ మామూలుగా పెరగలేదు. హిట్ కొట్టడం తారక్‌కి కొత్త కాకపోవచ్చు కానీ రాజమౌళి సినిమా తర్వాత హిట్ కొట్టడం అనేది మామూలు కిక్ ఇవ్వదు.

దేవరతో జరిగిందదే. ఈ జోష్‌లో ఉంటూనే ఫ్యూచర్ ప్లానింగ్ నెక్ట్స్ లెవల్‌లో సిద్ధం చేస్తున్నారు ఎన్టీఆర్. అందులో భాగంగానే అన్ని భాషల దర్శకులను అసెంబుల్ చేస్తున్నారు.

ట్రిపుల్ ఆర్‌తో పాన్ ఇండియన్ హీరో అయ్యాక.. అన్ని భాషల దర్శకులను కవర్ చేస్తున్నారు. కొరటాలతో దేవర చేసారు.. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు అయన్ ముఖర్జీతో వార్ 2 చేస్తున్నారు..

ఈ సినిమాతోనే నేరుగా నార్త్ ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు. దీని తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ లైన్‌లో ఉన్నారు. తమిళం నుంచి నెల్సన్, అట్లీ, వెట్రి మారన్ లాంటి దర్శకులతో ఎప్పట్నుంచో తారక్ చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం జైలర్ 2 పనుల్లో ఉన్నారు నెల్సన్. ఈ లోపు వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు జూనియర్.

ఈ సినిమా కథ, ఎన్టీఆర్ లుక్‌కు సంబంధించి చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తారక్ మూవీ కూడా కేజీఎఫ్, సలార్ తరహాలోనే డిఫరెంట్ టింట్‌తో ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం గట్టిగా జరిగింది.




