AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన విమానం.. రన్‌వేపై ల్యాండవుతుండగా ఊడిన టైర్.. ఇదిగో వీడియో

హైదరాబాద్ నుండి ఫుకెట్ బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. థాయిలాండ్‌లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా టైర్లపై ఒత్తిడి పడి విమానం టైర్ ఊడిపోయింది. కానీ విమానానికి కానీ, ప్రయాణికులకు కాని ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గమనించిన ఏటీబీ వెంటనే రన్‌వేను క్లోజ్ చేసి ప్రయాణికులను టెర్మినల్ లోపలికి తరలించారు.

Watch: హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన విమానం.. రన్‌వేపై ల్యాండవుతుండగా ఊడిన టైర్.. ఇదిగో వీడియో
Air India Express Incident
Anand T
|

Updated on: Mar 11, 2026 | 6:27 PM

Share

హైదరాబాద్ నుండి ఫుకెట్ బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. థాయిలాండ్‌లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా విమానం ముందు చక్రం ఊడిపోయింది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకటన ప్రకారం.. ఎయిర్ ఇండియాకు చెందిన AXB938, బోయింగ్ 737-800 ఎక్స్‌ప్రెస్ విమానం 131 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌ నుంచి బయల్దేరి బుధవారం ఉదయం 11:40కి గంటలకు పుకెట్‌ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకుంది.

అయితే సరిగ్గా ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం ముందు టైర్ సాంకేతిక సమస్య కారణంగా ఊడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే అలర్ట్ అయిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని విమానంలోని ప్రయాణికులందరినీ సేఫ్‌గా టెర్మినల్‌లోకి తరలించారు.ఇందుకు సహకరించిన ఫుకెట్ విమానాశ్రయ అధికారులకు, వారి సహకారానికి ఎయిర్‌లైన్ ధన్యవాదాలు తెలిపింది.

అయితే ప్రాథమిక తనిఖీల్లో విమానం హార్డ్ ల్యాండింగ్ కావడం వల్ల నోస్ వీల్ దెబ్బతింటుందని తేలింది. అయితే ఈ సంఘటన కారణంగా ఫుకెట్ విమానాశ్రయం మధ్యాహ్నం 12.08 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు తాత్కాలిక రన్‌వే మూసివేసింది. అలాగే ఫుకెట్‌లో ల్యాండ్ కావాల్సిన అన్ని విమానాలు ప్రత్యామ్నాయ విమానాశ్రయాలను ఉపయోగించుకోవాలని ప్రకటన జారీ చేసింది.

వీడియో చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం