Pushpa 2-Allu Arjun: పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్..
నక్కుకుంటూ కాదు.. తొక్కుకుంటూ పోవాలే.! ఇప్పుడు పుష్ప రాజ్ దూకుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. కనిపించిన ఒక్క రికార్డును కూడా వదిలేలా కనిపించడం లేదు బన్నీ. రాబోయే సినిమాలకు కనుచూపు మేరలో మరే రికార్డు కనబడకుండా చేయడమే పనిగా పెట్టుకున్నాడు పుష్ప. ఈ దూకుడుతో 2000 కోట్ల వైపు పుష్ప అడుగులు పడతాయా.? సినిమా ఎప్పుడొచ్చిందని కాదు.. ఇప్పటికీ ఎంత దూకుడు చూపిస్తుందనేది ముఖ్యం.