- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna Thama to Manchu Vishnu Kannappa latest film news from cinema industry
Film News: సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్..
తన కొత్త సినిమా విషయాలను పంచుకున్న రష్మిక మందన్న. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప నుంచి అప్‌డేట్. కొత్త సినిమా స్టార్ట్ చేసిన కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్. ఆ వార్తలపై స్పందించిన నయనతార భర్త విఘ్నేష్ శివన్. అట్లీ మీద కమెడియన్ కామెంట్స్ వైరల్. ఇలాంటి మూవీ వార్తలు గురించి ఈరోజు మనం చూద్దాం..
Updated on: Dec 21, 2024 | 5:00 PM

ప్రజెంట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ థామలో నటిస్తున్న రష్మిక మందన్న, ఆ సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఇప్పటి వరకు స్పై యూనివర్స్ మాత్రమే తెలిసిన ఆడియన్స్‌కు హారర్ సిరీస్‌లో థామ కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందన్నారు.

మంచు విష్ణు లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ కన్నప్ప నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో కిరాతగా నటిస్తున్న మోహన్‌లాల్ లుక్‌ను రివీల్ చేశారు. వంద కోట్లకు పైగా బడ్జెట్‌తో మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు.

అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కొత్త సినిమాను స్టార్ట్ చేశారు. గురు, ఆకాశం నీ హద్దురా సినిమాలతో నేషనల్ లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్న సుధా కొంగర దర్శకత్వంలో 25వ సినిమా చేస్తున్నారు శివ కార్తికేయన్. పీరియాడిక్ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు.

పుదుచ్చేరిలో ప్రభుత్వ ఆస్తులను కొనుగోలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై నయనతార భర్త విఘ్నేష్ శివన్ స్పందించారు. కొత్త సినిమా షూటింగ్‌కు సంబంధించిన పర్మిషన్స్ కోసమే తాను ప్రభుత్వ పెద్దలను కలిశానని, ఎలాంటి ఆస్తులు కొనటం లేదంటూ క్లారిటీ ఇచ్చారు.

దర్శకుడు అట్లీ మీద కమెడియన్ కపిల్ వేసిన జోక్ ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. బేబీ జాన్ ప్రమోషన్‌లో భాగంగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్న అట్లీ లుక్ విషయంలో చీప్ కామెంట్స్ చేశారు కపిల్. ఈ కామెంట్స్ మీద సౌత్ ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు.




