- Telugu News Photo Gallery Cinema photos Nani HIT 3 to Vennala Kishore Srikakulam Sherlock Holmes latest movie updates from film industry
Movie Updates: నాని న్యూ లుక్ అదుర్స్.. షెర్లాక్ హోమ్స్ ట్రైలర్..
ఆకట్టుకుంటున్న హీరో నాని న్యూ లుక్. వెన్నెల కిశోర్ ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. మహాభారతంపై ఆమిర్ ఖాన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్. విశ్వక్‌సేన్ చేస్తున్న కొత్త సినిమా లైలా. సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సికందర్ అప్డేట్. ఇలాంటి సినిమా న్యూస్ ఈరోజు తెలుసుకుందాం..
Updated on: Dec 21, 2024 | 4:25 PM

యంగ్ హీరో నాని మరో డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం హిట్ 3 షూటింగ్‌లో ఉన్న నేచురల్ స్టార్ ఆ సినిమాలో పూర్తిగా గ్రే హెయిర్‌తో కనిపించబోతున్నారు. తాజాగా నాని నయా లుక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కమెడియన్ వెన్నెల కిశోర్ లీడ్ రోల్ చేస్తున్న సినిమా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న సినిమాకు రైటర్ మోహన్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Vishwaksen

మహాభారతం గురించి మరోసారి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్. 'నా డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో బాధ్యతతో పాటు భయం కూడా ఉంది. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా భారీ స్థాయిలో మహాభారతాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నా' అన్నారు.

సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సికందర్ సినిమా ప్రమోషన్స్‌ను ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారు. డిసెంబర్ 27న సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా 2025 ఈద్‌గా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.




