- Telugu News Photo Gallery Cinema photos Keerthy Suresh after marriage photos goes viral in social media
Keerthy Suresh: పెళ్లైనా.. తగ్గేదే లే అంటున్న కీర్తి సురేష్
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. ఈ సామెత ఊరికే అనలేదు పెద్దలు. కీర్తి సురేష్ ఈ సామెతకు అర్థాన్ని చెప్తున్నారిప్పుడు. పెళ్లై రెండు వారాలు కూడా కాలేదు.. అప్పుడే పర్సనల్ లైఫ్‌ను పక్కనబెట్టి ప్రొఫెషనల్‌గా తాను చేయాల్సిన న్యాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్. మరి దానికి కారణమేంటో చూద్దామా..?
Updated on: Dec 22, 2024 | 9:37 PM

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. ఈ సామెత ఊరికే అనలేదు పెద్దలు. కీర్తి సురేష్ ఈ సామెతకు అర్థాన్ని చెప్తున్నారిప్పుడు. పెళ్లై రెండు వారాలు కూడా కాలేదు.. అప్పుడే పర్సనల్ లైఫ్‌ను పక్కనబెట్టి ప్రొఫెషనల్‌గా తాను చేయాల్సిన న్యాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్. మరి దానికి కారణమేంటో చూద్దామా..?

రెండు వారాలుగా సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉన్నారు కీర్తి సురేష్. ఆ మధ్య బేబీ జాన్‌లో అదిరిపోయే హాట్ సాంగ్.. ఆ వెంటనే పెళ్లి న్యూస్.. వారం రోజులు ఆగి ప్రియుడితో గోవాలో పెళ్లి.. అంతలోనే ఇప్పుడు ప్రమోషన్స్.. ఇలా అస్సలు గ్యాప్ లేకుండా కుమ్మేస్తున్నారు కీర్తి.

మెడలో పసుపు తాడు.. మోడ్రన్ క్యాస్ట్యూమ్స్‌తో తెగ వైరల్ అవుతున్నారు ఈ భామ. పెళ్లి కోసం వారం రోజులు మాత్రమే గ్యాప్ తీసుకున్న కీర్తి సురేష్.. వెంటనే బేబీ జాన్ ప్రమోషన్స్‌లో జాయిన్ అయిపోయారు. ముంబైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో కీర్తి అప్పియరెన్స్ అదిరిపోయింది.

డిసెంబర్ 25న బేబీ జాన్ రిలీజ్ కానుంది. వరుణ్ ధావన్ నటిస్తున్న ఈ చిత్రానికి అట్లీ నిర్మాత.. ఆయన అసిస్టెంట్ కలీస్ దర్శకుడు. బేబీ జాన్ విడుదల తర్వాతే సినిమాలకు కొన్నాళ్లు బ్రేక్ ఇవ్వనున్నారు కీర్తి. ప్రస్తుతం కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు ఈ బ్యూటీ.

అప్పుడెప్పుడో సైన్ చేసిన రివాల్వర్ రాణి, కన్నివేడి సినిమాల షూట్ చివరిదశకు వచ్చేసింది. ఇకపై మునపట్లా సినిమాలు చేస్తారా లేదా అనేది త్వరలోనే తేలనుంది. ప్రస్తుతానికైతే ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు కీర్తి సురేష్.