AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Tendulkar Family : సచిన్ టెండూల్కర్ కోడలు మామూలు ఉమెన్ కాదు.. అప్పుడే ఆ ఇంట్లో అందరినీ దాటేసిందిగా

Sachin Tendulkar Family : తాజాగా సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం సానియా చందోక్‌తో వైభవంగా జరిగింది. టెండూల్కర్ ఇంటికి కొత్త కోడలిగా అడుగుపెట్టిన సానియా రాకతో, అసలు ఈ ఫ్యామిలీలో అందరికంటే ఎక్కువ చదువుకున్న వారు ఎవరు? కొత్త కోడలు ఏం చదువుకుంది ? అనే ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

Sachin Tendulkar Family : సచిన్ టెండూల్కర్ కోడలు మామూలు ఉమెన్ కాదు.. అప్పుడే ఆ ఇంట్లో అందరినీ దాటేసిందిగా
Sachin Tendulkar Family
Rakesh
|

Updated on: Mar 11, 2026 | 5:00 PM

Share

Sachin Tendulkar Family : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజుగా వెలుగొందిన సచిన్ టెండూల్కర్ గురించి తెలియని వారుండరు. అయితే మైదానంలో పరుగుల వరద పారించిన సచిన్ కుటుంబం చదువు విషయంలో కూడా ఏమాత్రం తక్కువ కాదు. తాజాగా సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం సానియా చందోక్‌తో వైభవంగా జరిగింది. టెండూల్కర్ ఇంటికి కొత్త కోడలిగా అడుగుపెట్టిన సానియా రాకతో, అసలు ఈ ఫ్యామిలీలో అందరికంటే ఎక్కువ చదువుకున్న వారు ఎవరు? కొత్త కోడలు ఏం చదువుకుంది ? అనే ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. క్రికెట్ దేవుడిగా కొలవబడే సచిన్ నుంచి మొదలుకొని సానియా వరకు వారి విద్యా అర్హతలు ఒకసారి పరిశీలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్ చిన్న వయసులోనే తన జీవితాన్ని క్రికెట్‌కు అంకితం చేశారు. ముంబైలోని శారదాశ్రమ్ విద్యామందిర్ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్న సచిన్, ఆ తర్వాత ఆటపై ఉన్న ఇష్టంలతో కాలేజీ చదువును కంప్లీట్ చేయలేకపోయారు. అయినప్పటికీ, క్రికెట్ రంగంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో సహా అనేక ప్రతిష్టాత్మక సంస్థలు ఆయనకు గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశాయి. చదువు కంటే టాలెంటే గొప్పదని సచిన్ నిరూపించినా, ఆయన భార్య అంజలి మాత్రం టెండూల్కర్ ఫ్యామిలీలోనే అత్యంత విద్యావంతురాలు కావడం విశేషం.

అంజలి టెండూల్కర్

సచిన్ భార్య అంజలి టెండూల్కర్ టెండూల్కర్ కుటుంబంలోనే అత్యధిక విద్యార్హత కలిగిన వ్యక్తి. ఆమె వృత్తిరీత్యా పీడియాట్రిషియన్ (పిల్లల వైద్యురాలు). ముంబైలోని గ్రాంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అంజలి, ముంబై యూనివర్సిటీ నుంచి పీడియాట్రిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆమె విద్యావంతుల కుటుంబం నుంచి రావడమే కాకుండా, వైద్య రంగంలో సుదీర్ఘ కాలం పాటు సేవలందించారు. సచిన్ కెరీర్ కోసం ఆమె తన డాక్టర్ వృత్తిని త్యాగం చేసినా, చదువు విషయంలో ఆమె సాధించిన ఘనతను ఎవరూ మర్చిపోలేరు.

అర్జున్, సారా

సచిన్ వారసులు అర్జున్, సారా టెండూల్కర్ కూడా ఉన్నత విద్యను అభ్యసించారు. అర్జున్ టెండూల్కర్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, ముంబై యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. ప్రస్తుతం ఆయన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో పాటు గోవా తరపున క్రికెట్ ఆడుతున్నారు. ఇక సారా టెండూల్కర్ విషయానికి వస్తే, ఆమె కూడా అంబానీ స్కూల్‌లోనే చదివి, ఆ తర్వాత లండన్‌లోని యూనివర్శిటీ కాలేజ్ లండన్ నుంచి బయోమెడికల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ సాధించారు. ప్రస్తుతం ఆమె తన తండ్రి ఫౌండేషన్ పనుల్లో పాలుపంచుకోవడంతో పాటు సొంతంగా పిలేట్స్ స్టూడియోను ప్రారంభించి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.

కొత్త కోడలు సానియా చందోక్

ఇక సచిన్ ఇంటి కోడలు సానియా చందోక్ విషయానికి వస్తే, ఆమె చదువు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఆమె తన ఉన్నత విద్యను పూర్తి చేశారు. సానియా కేవలం చదువుకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. ముంబైలో Mr Paws పేరుతో ప్రీమియం పెట్ సెలూన్, స్పా, స్టోర్‌ను ఆమె నడుపుతున్నారు. జంతువుల సంరక్షణలో లగ్జరీ సేవలను అందించడంలో ఆమె బ్రాండ్ చాలా పేరు పొందింది. మొత్తానికి చదువు, సంస్కారం, సంపద కలిసిన ఒక గొప్ప విద్యావంతుల కుటుంబంగా టెండూల్కర్ ఫ్యామిలీ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంట్లో ఈ జంతువులు ఉంటే మీ తలరాతే మారిపోతుంది.. డబ్బే డబ్బు..
ఇంట్లో ఈ జంతువులు ఉంటే మీ తలరాతే మారిపోతుంది.. డబ్బే డబ్బు..
మెషిన్ పాడవకుండా మీ దుప్పట్లను ఇలా ఉతకండి..
మెషిన్ పాడవకుండా మీ దుప్పట్లను ఇలా ఉతకండి..
తీపి ద్రాక్షను కనిపెట్టే సింపుల్ టెక్నిక్స్ ఇవే!
తీపి ద్రాక్షను కనిపెట్టే సింపుల్ టెక్నిక్స్ ఇవే!
రాష్ట్రపతి భవన్ కు చేరిన శ్రీకాళహస్తి కీర్తి.. రాష్ట్రపతి చేతిలో
రాష్ట్రపతి భవన్ కు చేరిన శ్రీకాళహస్తి కీర్తి.. రాష్ట్రపతి చేతిలో
ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా.. ఏం జరిగిందంటే?
ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా.. ఏం జరిగిందంటే?
నేడే ఐపీఎల్ షెడ్యూల్ విడుదల..సాయంత్రం 7 గంటలకు లైవ్ అప్‌డేట్
నేడే ఐపీఎల్ షెడ్యూల్ విడుదల..సాయంత్రం 7 గంటలకు లైవ్ అప్‌డేట్
వామ్మో.. ఇలాంటి భార్యలు చాలా డేంజర్..
వామ్మో.. ఇలాంటి భార్యలు చాలా డేంజర్..
ట్రైన్ జర్నీలో విదేశీ మహిళకు ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు!
ట్రైన్ జర్నీలో విదేశీ మహిళకు ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు!
విమానం రోడ్డుపై ల్యాండ్ అవ్వడం ఎప్పుడైనా చూశారా?.. ఇదిగో వీడియో
విమానం రోడ్డుపై ల్యాండ్ అవ్వడం ఎప్పుడైనా చూశారా?.. ఇదిగో వీడియో
27 ఏళ్ల నాటి చెత్త రికార్డు బద్దలు.. పాక్ పరువు తీసిన ఆ నలుగురు
27 ఏళ్ల నాటి చెత్త రికార్డు బద్దలు.. పాక్ పరువు తీసిన ఆ నలుగురు