గులాబీ రేకులతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

Jyothi Gadda

23 December 2024

TV9 Telugu

గులాబీ పూలు కేవలం అందానికి, అలంక‌ర‌ణకు మాత్రమే కాదు.. పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాల నిధి. గులాబీ పూ రేకులలో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. అవేంటంటే..

TV9 Telugu

గులాబీ రేకుల్లో విటమిన్ ఎ, సి, ఇ, ఐరన్, కాల్షియం విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గులాబీ రేకులలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

TV9 Telugu

గులాబీ రేకుల్లోని గుణాలు శరీరంలోని వ్యర్ధపదార్ధాలను తొలగిస్తుంది. గులాబీ రేకుల ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

TV9 Telugu

గులాబీ రేకులను రోజు వారిగా నిర్ణీత మోతాదులో తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు? ఫలితంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. 

TV9 Telugu

ఆరోగ్యాన్ని, చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కాపాడ‌డంలో కూడా గులాబీలు అద్భుత ప్రయోజనాలు కలిగి ఉంది. ముఖ్యంగా నాటు గులాబీలు సౌందర్య సాధనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.  

TV9 Telugu

కొబ్బరి నూనెలో గులాబీ రేకులను కలిపి వేడి చేసి, చల్లరిన తరువాత తలకు రాసుకోవటం వల్ల మెదడు చల్లబడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. 

TV9 Telugu

గులాబీ రేకులు, బాదంపప్పు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకుంటే రక్తపోటు తగ్గిపోతుంది. గులాబీ రేకులతో తయారు చేసిన కషాయం తీసుకోవటం వల్ల శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ పోతుంది.

TV9 Telugu

గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చీముపట్టి బాధపెట్టే పుళ్ళ మీద గులాబీ పొడి చల్లితే యాంటీబయాటిక్ లా పనిచేస్తుంది. శరీరంలోని సెల్యులార్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. 

TV9 Telugu