పురుషులూ బీ కేర్‌ఫుల్.. ఇలా చేస్తే అస్సలు పిల్లలు పుట్టరట..!

23 December 2024

Ravi Kiran

ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది వేళపట్టున భోజనం చేయడం మానేశారు. తద్వారా అనేక రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. 

ఎన్ని పనులున్నా.. పౌష్టికాహారంతో కూడిన డైట్, శరీరానికి కాస్త వ్యాయామం తప్పనిసరిగా చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. 

అయితే తాజాగా ఓ అధ్యయనం పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. మన రోజూవారి డైట్ హెల్తీగా లేకపోతే లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. 

ఫాస్ట్ ఫుడ్ లాంటి ప్రాసెస్డ్ ఆహరం తినేవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి 

అధిక బరువు పెరిగిన వారిలో వీర్యకణాల ఉత్పత్తి మందగించేందుకు 81 శాతం అవకాశముందట. 

ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకోవడం, తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారిలో సంతానోత్పత్తి తగ్గిపోతుంది 

అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్నవారిలో  టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతున్నాయని అధ్యయనం చెబుతోంది.