Viral News: 10వ తరగతి పాస్ అయినందుకు తనకు తానే అభినందనలు తెలుపుకుంటూ యువకుడు ప్లెక్సీ ఏర్పాటు.. విద్యాశాఖ మంత్రి ప్రశంసలు
ఓ యువకుడు.. తాను బోర్డు పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందుకు తనను తాను అభినందించుకుంటూ.. ఫ్లెక్స్ బోర్డును ఏర్పాటు చేసుకున్నాడు. తన స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు వారితో పాటు ఆ ప్లెక్సీ ఏకంగా ఆ రాష్ట్ర విద్యా మంత్రి దృష్టికి చేరుకుంది. ఆకట్టుకుంది.
Viral News flex board: ఇప్పటి వరకూ ఎవరైనా విదేశాల నుంచి స్వదేశానికి వస్తున్న సమయంలోనో.. లేదంటే.. తమ విద్యార్థులు సాధించిన ఘనత ఇదంటూ విద్యా సంస్థల యాజమాన్యం ప్లెక్సీలను ఏర్పాటు చేయడం తెలుసు.. అయితే తాను అందరికంటే ఏమి తక్కువ కాదంటూ.. ఓ యువకుడు.. తాను బోర్డు పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందుకు తనను తాను అభినందించుకుంటూ.. ఫ్లెక్స్ బోర్డును ఏర్పాటు చేసుకున్నాడు. తన స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు వారితో పాటు అందరూ తన విజయం గురించి మాట్లాడేలా చేసుకున్నాడు..ఇప్పుడు ఆ ప్లెక్సీ ఏకంగా ఆ రాష్ట్ర విద్యా మంత్రి దృష్టికి చేరుకుంది. ఆకట్టుకుంది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కేరళకు చెందిన ఒక యువకుడు పదో తరగతి బోర్డు పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందుకు తనకు తాను అభినందనలు తెలుపుకుంటూ తన ఇంటి బయట ఓ ఫ్లెక్స్ బోర్డును ఏర్పాటు చేసుకున్నాడు. మొదటిసారి బోర్డు పరీక్షను క్లియర్ చేయడం మనలో చాలా మంది ఎడ్యుకేషన్ కెరీర్ లో ఒక మైలురాయిగా పరిగణిస్తారు. పతనం తిట్టాకు చెందిన జిష్ణు అనే విద్యార్థి తనకు తానే ప్లెక్సీ బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు. “చరిత్ర కొంతమందికి దారి ఇస్తుందని” అని ఫ్లెక్స్ బోర్డ్ రాసింది. ” 2022 SSLC పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందుకు ‘నన్ను నేను అభినందించుకుంటున్నాను.. కథ ఇప్పుడే ప్రారంభమవుతుంది. కుంజక్కు వెర్షన్ 3.0″ అని ప్లెక్సీ బోర్డు మీద ఉన్న సందేశంతో పాటు జిష్ణు సన్ గ్లాసెస్ ధరించిన ఫోటో ఉంది.
జిష్ణు ఫ్లెక్స్ బోర్డు వైరల్ అయ్యింది. కేరళ విద్యా మంత్రి వి శివన్‌కుట్టి దృష్టిని ఆకర్షించింది. “ఫ్లెక్స్‌లో చరిత్ర కొంతమందికి దారి ఇస్తుందని.. కుంజక్కు స్వయంగా చెప్పాడు. ఆ స్టూడెంట్ అదే విధంగా జీవితంలో ఉండాలని తాను కోరుకుంటున్నానని మంత్రి శివన్ చెప్పారు. కుంజక్కు జీవిత పరీక్షలో కూడా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను, ”అని శివన్‌కుట్టి ఫేస్‌బుక్ ద్వారా విశేష్ చెప్పారు. ఫ్లెక్స్ బోర్డును అమర్చేందుకు తన స్నేహితులు సహకరించారని జిష్ణు చెప్పాడు. అంతేకాదు తాను XI తరగతి ఉత్తీర్ణత సాధించినప్పుడు కూడా ఇలా తనకు తానే అభినందించుకుంటూ.. మరొక బోర్డుని ఏర్పాటు చేస్తానని.. చెబుతున్నాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..