Chemical Factory Blast: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్న అగ్నిమాకప సిబ్బంది..
బోయిసర్‌లోని తారాపూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ప్రీమియర్ ఇంటర్మీడియరీ కెమికల్ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి.
Chemical Factory Blast: మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని తారాపూర్ ఎంఐడీసీ ప్లాంట్‌లో మంగళవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖకు చెందిన మూడు వాహనాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మంటలను సత్వరమే అదుపులోకి తీసుకురాకపోతే ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
సమాచారం ప్రకారం.. బోయిసర్‌లోని తారాపూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ప్రీమియర్ ఇంటర్మీడియరీ కెమికల్ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించినప్పటి నుంచి వరుసగా ఎనిమిది భారీ పేలుళ్లు సంభవించాయని తెలుస్తోంది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియాల్సి ఉంది.
కెమికల్ కంపెనీలో మంటల స్వభావం తీవ్రంగా ఉండడంతో దాన్ని అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి పెను సవాలుగా మారింది. స్థానిక మున్సిపల్ అధికారులు, పోలీసులు, స్థానికుల సహకారంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కంపెనీలో పెద్దఎత్తున మండే పదార్థాలు నిల్వ ఉండడంతో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.
ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న ప్రజలు
కెమికల్ కంపెనీలో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున పొగ వెలువడుతుంది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగడం.. చీకటిగా ఉండడంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న మూడు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అగ్నిప్రమాదం కారణంగా కంపెనీలో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. బలమైన ప్రకంపనలు రావడంతో స్థానికుల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. అగ్నిప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
వాస్తవానికి పాల్ఘర్ జిల్లాలోని తారాపూర్ MIDCలో మంటలు చెలరేగే పదార్థాలు పెద్ద ఎత్తున నిల్వ ఉండటంతో ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు పెరిగాయి . రెండు నెలల క్రితం కూడా ఇక్కడ కెమికల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..