Viral Video: పెద్దపులిని బకరా చేసిన బాతు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో

నెట్టింట నిత్యం వైరల్ వీడియోలు కోకొల్లలుగా దర్శనమిస్తూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.

Viral Video: పెద్దపులిని బకరా చేసిన బాతు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో
Duck Vs Tiger
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 29, 2022 | 8:45 AM

Viral Video: నెట్టింట నిత్యం వైరల్ వీడియోలు కోకొల్లలుగా దర్శనమిస్తూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దాంతో సోషల్ మీడియాలో ఈ వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని భయాన్ని కలిగించేవి కాగా మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో మాత్రం ఇప్పుడు తెగ నవ్విస్తుంది. ఎంతటి ప్రమాదాన్నైనా తెలివి ఉపయోగిస్తే తేలికగా తప్పించుకోవచ్చు. అందుకు ఉదాహరణ ఈ వీడియో.  పులి వేటాడితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. అది వేటాడి వెంటాడి మరి చంపి తింటుంది. కానీ ఈ వీడియోలో మాత్రం ఓ పులి బాతు చేతిలో దారుణంగా మోసపోయింది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ బాతు నీళ్లలో ఈదుకుంటూ కనిపించింది. దాన్ని గమనించిన పులి ఎలాగైనా దాన్ని వేటాడాలని అనుకుంది. నెమ్మదిగా బాతు వెనకనుంచి ఎటాక్ చేద్దామని ప్రయత్నించింది. పులిని గమనించిన ఆ బాతు ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. దాంతో పులి షాక్ అయ్యింది. బాతు కనిపించకపోవడంతో ఆ పులి నిరాశపడి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కట్ చేస్తే ఆ బాతు నీటిలోనుంచి ఆ పులి వెనక వైపుకు వచ్చి మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ బాటు తెలివిని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. రకరకాల కామెంట్లు కురిపిస్తున్నారు. ఈ వైరల్ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి